
Haryana: కూలిన పాఠశాల పైకప్పు.. 25 మంది విద్యార్థులకు గాయాలు
హరియాణాలో ఘటన.. 5గురు విద్యార్థుల పరిస్థితి విషమం
(ప్రతీకాత్మక చిత్రం)
చండీగఢ్: హరియాణాలోని సోనేపత్ జిల్లాలో పాఠశాల భవనం కప్పుకూలింది. గన్నౌర్లోని పాఠశాల భవనం పైకప్పు కూలిపోవడంతో సుమారు 25 మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. వారిని వెంటనే దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురు విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం దిల్లీకి దగ్గర్లోని ఖాన్పూర్కి పంపారు. ఇదే ప్రమాదంలో ముగ్గురు కూలీలు కూడా తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.