Omicron : భారత్‌లో మూడో ఒమిక్రాన్‌ కేసు నమోదు

భారత్‌ను ఒమిక్రాన్‌ వేరియంట్‌ కలవరపెడుతోంది. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో రెండు కేసులు బయటపడగా..  తాజాగా దేశంలో మూడో ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. గుజరాత్‌

Updated : 04 Dec 2021 17:01 IST

జామ్‌నగర్‌ : భారత్‌ను ఒమిక్రాన్‌ వేరియంట్‌ కలవరపెడుతోంది. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో రెండు కేసులు బయటపడగా..  తాజాగా దేశంలో మూడో ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. గుజరాత్‌ రాష్ట్రంలోని జామ్‌నగర్‌లో ఓ వ్యక్తిలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఇటీవల జింబాబ్వే నుంచి వచ్చిన వ్యక్తిలో కొత్త వేరియంట్‌ను గుర్తించినట్లు తెలిపారు. సదరు వ్యక్తి రెండు రోజుల క్రితం జింబాంబ్వే నుంచి జామ్‌నగర్‌కు రాగా.. విమానాశ్రయం వద్ద అతడికి కరోనా పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్‌గా నిర్ధరణ కావడంతో.. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం పుణెలోని ల్యాబ్‌కు పంపించారు. తాజాగా వాటి ఫలితాలు విడుదలయ్యాయి. అతడు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ బారిన పడినట్లుగా నిర్ధారణ అయ్యింది.  దీంతో ఆ రాష్ట్ర అధికారులు అప్రమత్తమయ్యారు. కట్టడి చర్యలపై దృష్టి పెట్టారు.

మరోవైపు వేరే దేశాల నుంచి భారత్‌లో దిగిన కొందరి ఆచూకీ అధికారులకు చిక్కకపోవడం ఇప్పుడు సమస్యగా మారింది. వారు దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడంతో స్థానికంగా వైరస్‌ వ్యాప్తి చెందే ముప్పు పొంచి ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని