
Third Wave: మేం కరోనా మూడో వేవ్ మధ్యలో ఉన్నాం..!
హెచ్చరించిన బిహార్ ముఖ్యమంత్రి
పట్నా: రాష్ట్రంలో ఇప్పటికే కరోనా మూడో వేవ్ ప్రారంభమైందని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ హెచ్చరించారు. దేశంలో ఒకపక్క కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలవరానికి గురిచేస్తుండగా.. మరోపక్క కొత్త కేసులు పెరుగుతున్న తరుణంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క ఒమిక్రాన్ కేసు నమోదు కాకపోవడం గమనార్హం.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 96వ జాతీయ సదస్సులో మాట్లాడుతూ.. బిహార్ ఇప్పటికే మూడో వేవ్ మధ్యలో ఉందని వెల్లడించారు. అలాగే కేసులు పెరిగినా ఎదుర్కోవడానికి తమ ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నట్లు ఆయన భరోసా ఇచ్చారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు.
ప్రస్తుతం బిహార్లో 24 గంటల వ్యవధిలో 47 కేసులు నమోదయ్యాయి. క్రియాశీల కేసులు 156గా ఉన్నాయి. మొత్తంగా ఏడు లక్షల మందికి పైగా కరోనా బారినపడగా.. 12వేలకు పైగా మరణాలు సంభవించాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.