Modi’s US visit: అఫ్గానిస్థాన్, ఉగ్రవాదం, వాణిజ్యమే ప్రధాన అజెండా..

ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అమెరికా పర్యటనకు బయలుదేరనున్నారు. దీనిలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, మోదీ మధ్య పలు అంశాలు చర్చకురానున్నాయి. బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇరువురు నేతల మధ్య జరగనున్న మొదటి ప్రత్యక్ష భేటీ ఇది. దీనిపై మంగళవారం విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా వివరాలు వెల్లడించారు.  

Updated : 27 Feb 2024 16:42 IST

ప్రధాని అమెరికా పర్యటన.. వివరాలు వెల్లడించిన విదేశాంగ శాఖ

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అమెరికా పర్యటనకు బయలుదేరనున్నారు. దీనిలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, మోదీ మధ్య పలు అంశాలు చర్చకురానున్నాయి. బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇరువురు నేతల మధ్య జరగనున్న మొదటి ప్రత్యక్ష భేటీ ఇది. దీనిపై మంగళవారం విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా వివరాలు వెల్లడించారు.  

‘ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఉదయం అమెరికాకు బయలుదేరనున్నారు. 26న తిరిగివస్తారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ, బైడెన్ మధ్య తొలి ప్రత్యక్ష సమావేశం జరగనుంది. ఇద్దరు నేతలు గత కొద్ది నెలలుగా పలు అంశాలపై తరచూ సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు’ అని ష్రింగ్లా వెల్లడించారు. శాంతి భద్రతలు, రక్షణ, ఇరు దేశాల మధ్య వాణిజ్యం వంటి పలు అంశాలపై చర్చించనున్నట్లు చెప్పారు. ‘అఫ్గానిస్థాన్ పరిణామాలు, ఉగ్రవాద నెట్‌వర్క్‌ను విచ్ఛిన్నం చేయడం గురించి వారి మధ్య చర్చ జరగనుంది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, ఆ దేశ ప్రముఖ సంస్థల సీఈఓలతో ప్రధాని సమావేశం కూడా ఈ పర్యటనలో భాగమే’ అని తెలిపారు. 

అలాగే ఈ సమయంలో ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా, భారత్ మధ్య క్వాడ్ సదస్సు కూడా జరగనుందని ఇదివరకే విదేశాంగ శాఖ వెల్లడించింది. న్యూయార్క్‌ వేదికగా ఐరాస సర్వసభ్య సమావేశం 76వ సెషన్‌లో జరిగే జనరల్ డిబేట్‌లో ప్రధాని పాల్గొని ప్రసంగించనున్నారని తెలిపింది. ఇదిలా ఉండగా.. కరోనా కారణంగా దాదాపు ఆరు నెలల తర్వాత మోదీ వెళ్తోన్న తొలి విదేశీ పర్యటన ఇది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని