Gautam Gambhir: గౌతమ్ గంభీర్‌కు బెదిరింపులు.. భద్రత పెంపు
మాజీ క్రికెటర్, భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్‌కు ప్రాణహాని తలపెడతామంటూ ‘ఐఎస్ఐఎస్, కశ్మీర్’ పేరిట 24 గంటల్లోపు వ్యవధిలోనే 2 బెదిరింపు మెయిళ్లు వచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయనకు ...
దిల్లీ: మాజీ క్రికెటర్, భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్‌కు ప్రాణహాని తలపెడతామంటూ ‘ఐఎస్ఐఎస్, కశ్మీర్’ పేరిట 24 గంటల్లోపు వ్యవధిలోనే 2 బెదిరింపు మెయిళ్లు వచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయనకు భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు బుధవారం తెలిపారు. గంభీర్ అధికారిక మెయిల్ ఐడీకి మంగళవారం రాత్రి తొలి మెయిల్ వచ్చినట్లు చెప్పారు. ‘‘గంభీర్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు ప్రాణహాని తలపెట్టబోతున్నాం’’ అని ఆ మెయిల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు గంభీర్ వ్యక్తిగత కార్యదర్శి గౌరవ్ అరోడా రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు డీసీపీ (సెంట్రల్) శ్వేతా చౌహాన్ తెలిపారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఈ మెయిల్‌ను పంపించినట్లు చెప్పారు. తిరిగి బుధవారం మధ్యాహ్నం అదే ఐడీ నుంచి మరో మెయిల్ వచ్చినట్లు డీసీపీకి ఫోన్ ద్వారా ఫిర్యాదు అందింది. రెండో మెయిల్లో గంభీర్ ఇంటికి సంబంధించిన ఓ వీడియోను పంపించారు. ‘‘నిన్ను చంపాలనుకున్నాం. నిన్న తప్పించుకున్నావు. నువ్వు నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నట్లయితే రాజకీయాలకు, కశ్మీర్ అంశానికి దూరంగా ఉండు’’ అని రెండో మెయిల్లో గంభీర్‌ను బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గంభీర్‌కు వ్యక్తిగతంగాను, దిల్లీలోని ఆయన ఇంటివద్ద భద్రతను పెంచినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్‌రెడ్డి
-
టీసీఎస్‌లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్‌కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు