Updated : 12 Sep 2021 06:57 IST

Island: భారత్‌ సమీపంలోని 3 దీవులు చైనాకు అప్పగింత

శ్రీలంక ఎంపీ రాధాకృష్ణన్‌

చెన్నై, న్యూస్‌టుడే: భారత్‌కు సమీపాన  ఉన్న.. శ్రీలంకకు చెందిన 3 దీవులను చైనాకు అప్పగించినట్లు ఆ దేశ ఎంపీ రాధాకృష్ణన్‌ తెలిపారు. పవన విద్యుత్తు తయారీ కోసం ఈ దీవులను తమ దేశం చైనాకు అప్పగించిందని పేర్కొన్నారు. దీనివల్ల భారత్‌కు ముప్పు ఉంటుందని భావించి శ్రీలంక తమిళులు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. శ్రీలంక మలైయగ మక్కళ్‌ మున్నణి అధ్యక్షుడు, ఆ దేశ ఎంపీ రాధాకృష్ణన్‌ తమిళనాడులోని తిరుచ్చి వచ్చారు. ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ జాతీయ అధ్యక్షుడు కేఎం ఖాదర్‌ మొహిద్దీన్‌ నివాసంలో శనివారం రాధాకృష్ణన్‌ విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలోని శ్రీలంక శరణార్థుల శిబిరాలను పునరావాస నివాసాలుగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ మార్చడం అభినందనీయమన్నారు. శ్రీలంకలో తమిళులు నివసించే ప్రాంతంలో భారత్‌ 50 వేల ఇళ్లు నిర్మించిందని చెప్పారు. రైలుమార్గం, విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. తమ దేశంలో 500 హెక్టార్ల విస్తీర్ణంలో చైనా పోర్టును ఏర్పాటు చేస్తోందని, ఇప్పటివరకు 70శాతం పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. వ్యాపార దృక్పథంతో చైనా పెట్టుబడులకు శ్రీలంక ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్