Saudi Arabia: రెడ్‌లిస్ట్‌ దేశాలకు వెళ్తే మూడేళ్ల ప్రయాణ నిషేధం

కొవిడ్‌ తీవ్రత అధికంగా ఉండి ‘రెడ్‌ లిస్ట్‌’లో ఉన్న దేశాలకు వెళ్లిన తమ పౌరులకు మూడేళ్ల పాటు ప్రయాణాలు నిషేధిస్తూ సౌదీ అరేబియా నిర్ణయం తీసుకుంది.

Updated : 17 Oct 2022 14:47 IST

సౌదీ జాబితాలో భారత్‌ కూడా..

దుబాయ్‌: కొవిడ్‌ తీవ్రత అధికంగా ఉండి ‘రెడ్‌ లిస్ట్‌’లో ఉన్న దేశాలకు వెళ్లిన తమ పౌరులకు మూడేళ్ల పాటు ప్రయాణాలు నిషేధిస్తూ సౌదీ అరేబియా నిర్ణయం తీసుకుంది. ఈ జాబితాలో భారత్‌ కూడా ఉంది. ఈ ఆదేశాలను తప్పకుండా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని సౌదీ ప్రభుత్వం హెచ్చరించింది. ప్రయాణ నిషేధాన్ని ఉల్లంఘించిన వారికి భారీ జరిమానా విధిస్తామని.. అదేవిధంగా మూడేళ్లపాటు వారు విదేశాలు వెళ్లకుండా నిషేధానికి గురవుతారని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు స్థానిక పత్రిక సౌదీ ప్రెస్‌ ఏజెన్సీ(ఎస్‌పీఏ) వెల్లడించింది. ‘రెడ్‌ లిస్ట్‌’లో యూఏఈ, లిబియా, సిరియా, లెబనాన్‌, యెమెన్‌, ఇరాన్‌, టర్కీ, అర్మేనియా, ఇథియోపియా, సోమాలియా, కాంగో, అఫ్గానిస్థాన్‌, వెనెజువెలా, బెలారస్‌, వియత్నాం, భారత్‌ తదితర దేశాలు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని