Natural Farming: రైతులారా.. ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లండి..!

వ్యవసాయానికి సంబంధించి సమస్యలు తీవ్రంగా మారకముందే సేంద్రీయ లేదా ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతులకు సూచించారు.

Published : 16 Dec 2021 20:18 IST

ఇదే సరైన సమయమన్న ప్రధాని మోదీ

దిల్లీ: వ్యవసాయానికి సంబంధించి సమస్యలు తీవ్రంగా మారకముందే సేంద్రీయ లేదా ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతులకు సూచించారు. ఇందుకు ఇదే సరైన సమయమన్న ఆయన.. వ్యవసాయాన్ని రసాయనశాల నుంచి బయటకు తీసుకువచ్చి ప్రకృతికి అనుసంధానం చేయాలని ఆకాంక్షించారు. గుజరాత్‌లోని ఆనంద్‌ పట్టణంలో నిర్వహిస్తున్న ఆగ్రో అండ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జాతీయ సదస్సు ముగింపు సందర్భంగా రైతులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రధాని మోదీ ప్రసంగించారు.

‘హరిత విప్లవ సమయంలో రసాయనాలు, ఎరువులు కీలక పాత్ర వహించాయన్న మాట వాస్తవం. కానీ, వాటికి ప్రత్యామ్నాయాల వైపు వెళ్లడం కూడా ఎంతో అవసరం. వ్యవసాయానికి సంబంధించి సమస్యలు తీవ్రంగా మారకముందే.. కీలక చర్యలు తీసుకునేందుకు ఇదే సరైన సమయం. వ్యవసాయాన్ని రసాయనశాల నుంచి బయటకు తీసుకువచ్చి ప్రకృతికి అనుసంధానం చేయాలి. ఇందులో భాగంగా ప్రకృతి వ్యవసాయాన్ని ఓ ఉద్యమంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్రాలు చర్యలు చేపట్టాలి’ అని ప్రధాని మోదీ సూచించారు.

ఐదెకరాలలోపు భూమి ఉన్న రైతులు రసాయనాల కోసం విపరీతంగా ఖర్చు చేస్తున్నారని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపాలని సూచించారు. ఈ తరహా వ్యవసాయంలో విత్తనాల నుంచి నేల వరకు అన్నీ సహజంగానే సేకరించవచ్చన్న ఆయన.. దీనివల్ల దేశంలోని సన్నకారు రైతులకే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక వ్యవసాయ రంగంలో మార్పులు తెచ్చేందుకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌, సేంద్రీయ వ్యవసాయం ఎంతగానో దోహదపడుతాయని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని