Omicron: కొత్త వేరియంట్‌ లక్షణాలు తక్కువే.. అలా అనీ..!

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. డెల్టా వేరియంట్ కంటే స్వల్ప లక్షణాలు కలిగిఉన్నట్లు తెలుస్తోంది. ప్రారంభ నివేదికలను బట్టి ఈ విషయం వెల్లడవుతోందని అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యనిపుణుడు ఆంటోనీ ఫౌచీ అభిప్రాయపడ్డారు.

Published : 07 Dec 2021 03:02 IST

స్పందించిన ప్రముఖ వైద్య నిపుణుడు ఫౌచీ

వాషింగ్టన్‌: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. డెల్టా వేరియంట్ కంటే స్వల్ప లక్షణాలు కలిగిఉన్నట్లు తెలుస్తోంది. ప్రారంభ నివేదికలను బట్టి ఈ విషయం వెల్లడవుతోందని అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యనిపుణుడు ఆంటోనీ ఫౌచీ అభిప్రాయపడ్డారు. ఈ సంకేతాలు ఊరటనిస్తున్నాయన్నారు. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్ అక్కడ వేగంగా వ్యాప్తి చెందుతోంది. అయితే ఆసుపత్రుల్లో చేరిక మాత్రం ఆందోళన కలిగించే స్థాయిలో లేదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచమంతా కొత్త వేరియంట్ ప్రారంభ దశలో ఉంది. ఈ సమయంలో వెలుగులోకి వచ్చిన సమాచారం ఆధారంగా వైరస్ తీవ్రతపై ఒక అంచనాకు రావడంపై ఫౌచీ హెచ్చరికలు చేశారు.

‘ఇప్పటివరకైతే.. ఈ వేరియంట్ వల్ల తీవ్రస్థాయిలో లక్షణాలు కనిపించడం లేదు. అయితే ఈ వేరియంట్ అంత తీవ్రమైందేమీ కాదని లేక డెల్టా  కంటే స్వల్ప లక్షణాలనే చూపుతుందని ఒక తీర్మానం చేసేముందు మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి’ అని వైద్య నిపుణులను ఉద్దేశించి ఫౌచీ ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. దక్షిణాఫ్రికా ఈ కొత్త వేరియంట్‌పై ప్రపంచాన్ని అప్రమత్తం చేయగానే.. అక్కడి నుంచి రాకపోకలు సాగించేవారిపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ తీరును ఐరాస జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ ఖండించారు. ఇది పారదర్శతను దెబ్బతీస్తుందని పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ఫౌచీ స్పందిస్తూ.. తమ దేశం ఆ నిషేధాన్ని సరైన సమయంలో ఎత్తివేస్తుందని ఆశిస్తున్నానన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు