Train: రైలు వేగంగా వస్తోంది.. పట్టాలపై మనిషి.. ఆ తరువాత..

ఓ లోకోపైలట్‌ చురుగ్గా స్పందించడంతో నిండు ప్రాణం నిలబడింది. ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తిని గుర్తించి అప్రమత్తంగా వ్యవహరించిన అతడు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రశంసలు అందుకున్నారు. దానికి సంబంధించిన ఫుటేజీని మంత్రిత్వ శాఖ ట్విటర్‌లో షేర్‌ చేసింది. 

Published : 03 Jan 2022 19:44 IST

ముంబయి: ఓ లోకోపైలట్‌ చురుగ్గా స్పందించడంతో నిండు ప్రాణం నిలబడింది. ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తిని గుర్తించి అప్రమత్తంగా వ్యవహరించిన అతడు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రశంసలు అందుకున్నారు. దానికి సంబంధించిన ఫుటేజీని మంత్రిత్వ శాఖ ట్విటర్‌లో షేర్‌ చేసింది. 

ముంబయికి దగ్గర్లోని సెవ్రీ స్టేషన్‌కు రైలు వచ్చే సమయానికి ఓ వ్యక్తి పట్టాలపై తచ్చాడుతూ కనిపించాడు. పట్టాలు దాటతాడేమో అనుకుంటుండగానే.. వాటిపై పడుకున్నాడు. మరోపక్క రైలు చాలా దగ్గరగా వచ్చేసింది. ఇక ఆ వ్యక్తిని కాపాడటం కష్టమేమో అనుకునే సమయానికి దగ్గరగా వచ్చిన రైలు కాస్తా ఆగిపోయింది. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని లోక్‌పైలట్ గమనించి ఎమర్జెన్సీ బ్రేక్‌ను  వాడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే రైల్వే సిబ్బంది వచ్చి ఆ వ్యక్తిని పట్టాల మీద నుంచి పక్కకు తీసుకువచ్చారు. ఆ వీడియోను గమనిస్తే.. నిన్న ఉదయం 11.45 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. దానినిషేర్ చేస్తూ మంత్రిత్వ శాఖ లోకోపైలట్‌ను అభినందించింది. ‘ఈ జీవితం విలువైంది. నీ కోసం ఇంటి దగ్గర ఎదురుచూస్తుంటారు’ అని ఆ వ్యక్తిని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని