కేంద్ర కేబినెట్‌ అత్యవసర భేటీ.. 

తమిళనాడులో సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కూలిన నేపథ్యంలో కేంద్ర కేబినెట్‌ అత్యవసరంగా సమావేశమైంది.

Updated : 08 Dec 2021 17:49 IST

దిల్లీ: తమిళనాడులో సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కూలిన నేపథ్యంలో కేంద్ర కేబినెట్‌ అత్యవసరంగా సమావేశమైంది.  ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ప్రమాదంపై ప్రధానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ వివరించారు.

మరోవైపు ఈ  ఘటనపై కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంట్‌లో ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రేపు పార్లమెంట్‌లో ప్రకటన చేయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఘటన అనంతర పరిస్థితులను రాజ్‌నాథ్ సమీక్షిస్తున్నారు. కొద్ది సేపటి క్రితం దిల్లీలోని రావత్‌ నివాసానికి కూడా వెళ్లారు. ఈ సాయంత్రం ఆయన ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై వాయుసేన సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని