
Smriti Irani: రచయిత్రిగా మారిన స్మృతి .. నవల పేరేంటో తెలుసా..?
దిల్లీ: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ రచయిత్రిగా మారారు. త్వరలో తన మొదటి నవల ‘లాల్ సలాం’తో పాఠకులను పలకరించనున్నారు. ఈ విషయాన్ని ఆమె ట్విటర్ వేదికగా వెల్లడించారు. 2010 ఏప్రిల్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో 76 మంది కేంద్రీయ రిజర్వ్ పోలీసు సిబ్బందిని హతమార్చిన ఘటన ఇతివృత్తంగా ఈ నవల రాసినట్లు వెల్లడించారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని దేశానికి సేవ చేసిన వ్యక్తులకు నివాళిగా దీన్ని తీసుకువస్తున్నట్లు చెప్పారు.
‘ఎన్నో ఏళ్లుగా ఈ కథ నా మదిలో మెదులుతూనే ఉంది. చివరకు దాన్ని కాగితంపై పెట్టకుండా విస్మరించలేని సమయం వచ్చింది. పాఠకులకు పెద్దగా పరిచయం లేని మారుమూల ప్రాంతంలో వెలుగుచూసిన ఈ దారుణ కథనం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను’ అని ఇరానీ తన పుస్తకం గురించి వెల్లడించారు. ఈ పుస్తకంలో విక్రమ్ ప్రతాప్ సింగ్ అనే యువ అధికారి గురించి, అవినీతిలో మునిగిపోయిన వ్యవస్థ కారణంగా ఆయనకు ఎదురైన సవాళ్ల గురించి వివరించారు. నవంబర్ 29న ఈ పుస్తకం విడుదల కానుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Most Expensive Pillow: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండు.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!
-
General News
Health: వృద్ధాప్యం వస్తే ఏం తినాలో తెలుసా..?
-
India News
Agnipath: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. మూడు రోజుల్లోనే ఎన్ని వచ్చాయంటే..?
-
India News
Election Commission: పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం మాకివ్వండి: ఈసీ
-
World News
Ukraine Crisis: జీ-7 సదస్సు వేళ.. కీవ్‌పై విరుచుకుపడిన రష్యా!
-
Politics News
AAP: ఆప్‌కు చుక్కెదురు! సీఎం మాన్ ఖాళీ చేసిన ఎంపీ స్థానంలో ఓటమి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Chiranjeevi: నాకూ గోపీచంద్‌కు ఉన్న సంబంధం అదే: చిరంజీవి
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Bypolls: యూపీలో భాజపాకు బిగ్ బూస్ట్.. పంజాబ్‌లో ఆప్‌కు భంగపాటు
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- E Passport: ఈ పాస్‌పోర్ట్‌లు వస్తున్నాయ్.. ఎప్పటి నుంచి జారీ చేస్తారు?ఎలా పనిచేస్తాయి?
- PCOD: అధిక బరువుకు బై బై చెప్పేద్దామా.. పరిష్కార మార్గాలివిగో..!
- Droupadi Murmu: ఎట్టకేలకు మోక్షం.. ద్రౌపదీ ముర్ము స్వగ్రామానికి కరెంటు..!
- అక్కడి మహిళలు ఆ ఒక్క రోజే స్నానం చేస్తారట!
- Agnipath: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. మూడు రోజుల్లోనే ఎన్ని వచ్చాయంటే..?
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్