
US Reopens Borders: ఆంక్షలు లేని అమెరికా యానం.. ఆనందమే ఇక
వాషింగ్టన్ : పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్న అంతర్జాతీయ ప్రయాణికులు అమెరికా బాట పట్టారు. ట్రంప్ హయాంలో విధించిన కొవిడ్ ఆంక్షలన్నింటినీ ఆ దేశం ఎత్తివేయడంతో ప్రయాణాలు ఊపందుకున్నాయి. కొవిడ్ నిర్ధారణ పరీక్షలో నెగెటివ్ ఫలితం వచ్చినట్టు ధ్రువీకరణ పత్రాలు చూపి పలువురు అమెరికా విమానం ఎక్కేస్తున్నారు. వారికి స్వాగతం పలికేందుకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు విమానాశ్రయాలకు చేరుకుంటున్నారు. దీంతో మియామి, లాస్ ఏంజెలెస్, వాషింగ్టన్, అట్లాంటా, న్యూయార్క్, చికాగో, బోస్టన్ తదితర ప్రయాణ ప్రాంగణాల్లో సందడి నెలకొంది. సుదీర్ఘ విరామం తర్వాత తమ ఆత్మీయులను చూసి భావోద్వేగానికి గురవుతున్న దృశ్యాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. విదేశీ ప్రయాణికుల రాక విమానయాన సిబ్బందిలోనూ జోష్ నింపింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.