Mamata Banerjee: ప్రధాని రేసులో మా కెప్టెన్ ముందున్నారు: సుప్రియో

2024 ఎన్నికల్లో ప్రధాన మంత్రి పదవికి పోటీ పడే అభ్యర్థుల్లో పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముందున్నారని ఆ పార్టీ నేత బాబుల్ సుప్రియో అన్నారు.

Published : 21 Sep 2021 01:28 IST

కోల్‌కతా: 2024 ఎన్నికల్లో ప్రధాన మంత్రి పదవికి పోటీ పడే అభ్యర్థుల్లో పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముందున్నారని ఆ పార్టీ నేత బాబుల్ సుప్రియో అన్నారు. ‘2024 ఎన్నికల్లో మా పార్టీ కెప్టెన్ మమతా బెనర్జీ  ప్రధాని కావాలని నేను కోరుకుంటున్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో విపక్షాలు ముఖ్య పాత్రను పోషిస్తాయి. ప్రధాన మంత్రి పదవికి మమత ముందు వరుసలో ఉన్నారనే వాస్తవాన్ని ఎవరూ విస్మరించలేరు’ అంటూ సుప్రియో తాజాగా మీడియాతో మాట్లాడారు.    

ఈ కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన బాబుల్ సుప్రియో.. కేబినెట్ విస్తరణలో భాగంగా ఆ పదవిని కోల్పోయారు. ఆ నేపథ్యంలోనే తాను రాజకీయాల నుంచి దూరం అవుతున్నానని ప్రకటించి ఆశ్చర్యపర్చారు. కానీ రెండు రోజుల క్రితం భాజపా నుంచి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు.

ప్రధాని మోదీని ఎదుర్కోవడంలో, ఆయనకు ప్రత్యామ్నాయంగా మారడంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విఫలమయ్యారని ఇటీవల తృణమూల్ పార్టీ పత్రిక జాగో బంగ్లా రాసుకొచ్చింది. ఈ క్రమంలోనే సుప్రియో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీల నుంచి భాజపాలోకి కొత్తవారి రాకతో ఇప్పటికే ఉన్న నేతల్లో ఆగ్రహం నెలకొని ఉందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. దానిపై ఆ పార్టీ దృష్టిసారించాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని