Yahoo Shuts Down News Websites: భారత్‌లో న్యూస్‌ వెబ్‌సైట్లు మూసివేసిన యాహూ..!

యాహూ సంస్థ భారత్‌లో న్యూస్‌ వెబ్‌సైట్‌ను మూసివేసింది. తాజాగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనల్లో మార్పురావడంతో ఈ నిర్ణయం తీసుకొంది. విదేశీ యాజమాన్యంలోని

Published : 26 Aug 2021 15:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యాహూ సంస్థ భారత్‌లో న్యూస్‌ వెబ్‌సైట్‌ను మూసివేసింది. తాజాగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనల్లో మార్పురావడంతో ఈ నిర్ణయం తీసుకొంది. విదేశీ యాజమాన్యంలోని మీడియా కంపెనీల డిజిటల్‌ కంటెంట్‌ను ఇది నియంత్రిస్తోంది. మూసివేస్తున్న వెబ్‌సైట్లలో యాహూ న్యూస్‌, క్రికెట్‌,ఫైనాన్స్‌,ఎంటర్‌టైన్‌మెంట్‌,మేకర్స్‌ ఇండియా ఉన్నాయి. భారత్‌లో యాహూ మెయిల్స్‌, సెర్చ్‌ ఇంజిన్‌ వినియోగించే వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని అన్నారు. 

‘‘26 ఆగస్టు 2021 నుంచి ‘యాహూ ఇండియా’ భారత్‌లో ఎటువంటి కంటెట్‌ను ప్రచురించదు. ఈ నిర్ణయం ప్రభావం వినియోగదారుల మెయిల్‌ ఖాతా, సెర్చింగ్‌ వంటి సౌకర్యాలపై ఏ మాత్రం పడదు. మీ మద్దతుకు కృతజ్ఞతలు’’ అని యాహూ వెబ్‌సైట్‌లో ఒక నోటీస్‌ను ఉంచింది. యాహూను 2017లో అమెరికా టెక్‌ దిగ్గజం వెరిజిన్‌ కొనుగోలు చేసింది. 

‘‘ఇది తేలిగ్గా తీసుకొన్న నిర్ణయం కాదు. భారత్‌లోని నియంత్రణ చట్టాల్లో మార్పులు విదేశీ యాజమాన్యంలో డిజిటల్‌ కంటెంట్‌ను ప్రచురించే మీడియా కంపెనీలపై ప్రభావం చూపాయి. యాహూ భారత్‌లో 20 ఏళ్లపాటు ఇక్కడి వినియోగదారులకు స్థానిక,ప్రీమియం కంటెంట్‌ను అందించింది. క్రికెట్‌ వెబ్‌సైట్‌కు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. మాపై నమ్మకం ఉంచిన వినియోగదారులకు ధన్యవాదాలు’’ అని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని