ZyCoV-D: జైడస్‌ క్యాడిలా టీకాకు ఈ వారంలోనే అనుమతులు!

గుజరాత్‌కు చెందిన ఫార్మా దిగ్గజం జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేసిన కొవిడ్‌ టీకా జైకోవ్‌-డి టీకాకు అతి త్వరలో అనుమతులు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Published : 09 Aug 2021 15:54 IST

దిల్లీ: గుజరాత్‌కు చెందిన ఫార్మా దిగ్గజం జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేసిన కొవిడ్‌ టీకా జైకోవ్‌-డి టీకాకు అతి త్వరలో అనుమతులు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. జైకోవ్‌-డి టీకాకు భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) ఈ వారంలోనే అత్యవసర వినియోగ అనుమతులు జారీ చేసే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు సోమవారం వెల్లడించాయి. జులై 1వ తేదీన ఈ కంపెనీ అత్యవసర అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది.

డీఎన్‌ఏ సాంకేతికతతో జైడస్‌ క్యాడిలా ఈ టీకాను అభివృద్ధి చేసింది. ఇది మూడు డోసుల టీకా. 0-28-56 రోజుల్లో తీసుకోవాలి. 12 ఏళ్ల పైబడినవారిపై తమ టీకా పని చేస్తుందని కంపెనీ వెల్లడించింది. అనుమతులు వచ్చాక ఏటా 24కోట్ల డోసులను ఉత్పత్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. జైకోవ్‌-డి టీకాకు అనుమతులు లభిస్తే ప్రపంచంలోనే తొలి డీఎన్‌ఏ ఆధారిత కరోనా వ్యాక్సిన్‌ ఇదే అవుతుంది.

ఈ టీకాకు డీసీజీఏ అనుమతులు మంజూరు చేస్తే.. దేశంలో అందుబాటులోకి వచ్చే ఆరో టీకా ఇదే కానుంది. ప్రస్తుతం కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌, స్పుత్నిక్‌ వి టీకాల పంపిణీ జరుగుతుండగా.. అమెరికాకు చెందిన మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకాల వినియోగానికి కూడా కేంద్రం ఇటీవల గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని