Chicken Biryani: ఈ మేకకు రోజూ.. చికెన్‌ బిరియానీ

సాధారణంగా మేకలు శాకాహార జంతువులు. చెట్ల ఆకులు, కూరగాయలు, ధాన్యం తిని బతుకుతాయి. మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌ పట్టణ సమీపాన లోహారి గ్రామ రైతు రఫీఖ్‌ పెంచుతున్న మేక ‘భూరి’కి మాత్రం రోజూ చికెన్‌ బిరియానీ కావాల్సిందే.

Updated : 31 Dec 2021 05:09 IST

దేవాస్‌: సాధారణంగా మేకలు శాకాహార జంతువులు. చెట్ల ఆకులు, కూరగాయలు, ధాన్యం తిని బతుకుతాయి. మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌ పట్టణ సమీపాన లోహారి గ్రామ రైతు రఫీఖ్‌ పెంచుతున్న మేక ‘భూరి’కి మాత్రం రోజూ చికెన్‌ బిరియానీ కావాల్సిందే. చెట్ల ఆకుల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. విషయం తెలిసి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తున్న జనం ఓ వింతలా ఈ మేకను చూసి పోతున్నారు. రఫీఖ్‌ తన పొలంలో ఆవులు, గేదెలు, మేకలు పెంచుతున్నారు. వీటిలో ‘భూరి’ ప్రత్యేకం. మాంసాహారమంటే తెగ ఇష్టపడే ఈ మేక.. చికెన్‌, మటన్‌, చేప, గుడ్లు ఏదైనా గుటుక్కుమని తినేస్తుంది. ‘మా పొలంలో పుట్టిన ‘భూరి’ని చిన్నప్పటి నుంచీ పెంచుతున్నా. మూడేళ్లుగా మాంసాహారం తింటోంది. చికెన్‌ రోజూ కావాల్సిందే’ అని రఫీఖ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని