Temjen Imna Along: ఫుడ్‌ గురించి పోస్టు.. నేను సైలెంట్‌గా ఎలా ఉంటా..?

నాగాలాండ్ మంత్రి తెమ్జెన్ అలోంగ్‌(Temjen Imna Along) నెట్టింట్లో చెప్పే మాటలు నవ్వులు పూయిస్తుంటాయి. తాజాగా ఆయన పానీపూరీ గురించి పోస్టు పెట్టారు. 

Published : 21 Mar 2023 17:40 IST

దిల్లీ: స్ట్రీట్‌ ఫుడ్‌కు ఉండే టేస్టే వేరు. భారత్‌లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆహారం లభిస్తుంటుంది. అయితే పానీపూరీ మాత్రం భారతీయులందరికీ ఫేవరెట్‌. తాజాగా భారత్‌లో పర్యటించిన జపాన్ ప్రధాని ఫుమియో కిషిద (Fumio Kishida)కూడా దాని రుచికి ఫిదా అయ్యారు. ఆయన పానీపూరీ తింటున్న దృశ్యాలను ప్రధాని మోదీ ట్విటర్‌లో షేర్ చేశారు. ఇప్పుడు దానిపై నాగాలాండ్ భాజపా నేత తెమ్జెన్‌ ఇమ్నా అలోంగ్‌(Temjen Imna Along) స్పందించారు. 

‘ఆహారం గురించి ఏదైనా పోస్టు కనిపించినప్పుడు నేను స్పందించకుండా ఎలా ఉంటాను..? జపాన్ ప్రధాని కూడా అందరిని కట్టిపడేసే పానీపూరీని రుచి చూడకుండా ఉండలేకపోయారు. గురూజీ(మోదీని ఉద్దేశించి) స్టైలే వేరు’ అంటూ జపాన్‌ ప్రధాని పానీపూరీ తింటున్న వీడియోను షేర్ చేశారు. 


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు