Temjen Imna Along: నా హెల్పింగ్ హ్యాండ్ ఇదే.. నవ్వులు పూయిస్తోన్న మంత్రి పోస్టు

నాగాలాండ్ మంత్రి తెమ్జెన్ ఇమ్నా అలోంగ్‌(Temjen Imna Along) మరోసారి ఒక ఫన్నీ పోస్టుతో నెట్టింట్లో దర్శనమిచ్చారు. 

Published : 14 Jun 2024 00:07 IST

కోహిమా: ఆనంద్ మహీంద్రా, హర్ష గోయెంకా మాదిరిగా ఎక్స్‌(ట్విటర్‌)లో చురుగ్గా ఉంటూ, హాస్యం పండిస్తుంటారు నాగాలాండ్(Nagaland) మంత్రి తెమ్జెన్ ఇమ్నా అలోంగ్‌(Temjen Imna Along). అదే తరహాలో ఆయన షేర్ చేసిన ఓ ఫొటో నవ్వులు పూయిస్తోంది.

ఎయిర్‌ పోర్టు వెయింటింగ్ ఏరియాలో కూర్చొని ఫోన్‌ చూస్తున్న ఫొటో అది. ఆయన తన చేతిని సపోర్టు కోసం పొట్ట మీద ఉంచి.. కుర్చీలో కాస్త వెనక్కివాలి, ఫోన్‌లో ఏదో చూసుకుంటున్నారు. ఆ ఫొటోనే నవ్వు తెప్పిస్తుంటే, ఆయన పెట్టిన కామెంట్ మరింత సరదాగా ఉంది. దానిని ఎక్స్‌ వేదికగా షేర్ చేసిన ఆయన.. నా పొట్టే నా హెల్పింగ్‌ హ్యాండ్‌ అనే అర్థంలో ఒక వ్యాఖ్యను జోడించారు. దీనిపై నెటిజన్లు ఫన్నీ స్పందించారు. సూపర్ సర్ అంటూనే.. ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండని సూచించారు. అందరికీ ఈ లగ్జరీ ఉండదని, ఈ స్థాయికి చేరుకోవడానికి స్థిరమైన ప్రయత్నం ఉండాలంటూ మరొకరు స్పందించారు. దానిపై ల్యాప్‌టాప్‌ కూడా ఉంచి పని చేసుకోవచ్చేమో అని మరొకరు సెటైర్ వేశారు. గతంలోనూ మంత్రి ఫోన్‌ చూస్తూ నిద్రపోతున్నట్లు ఉన్న ఒక ఫొటో వైరల్ అయింది. దానికి ఆయన ‘‘నేను నిద్రపోవడం లేదు. తర్వాత పోస్టును టైప్ చేస్తున్నా’’ అంటూ స్మైలీ ఎమోజీని జత చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని