Smart Helmet: ఈ హెల్మెట్‌ భలే స్మార్ట్‌.. పదో తరగతి విద్యార్థిని అద్భుత ఆలోచన

ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే, వెంటనే ఆ సమాచారాన్ని లొకేషన్‌తో సహా కుటుంబ సభ్యులకు చేరవేసేలా రిధిమా ఠాకుర్‌ అనే పదో తరగతి విద్యార్థిని స్మార్ట్‌ హెల్మెట్‌ను రూపొందించింది.

Updated : 07 Jan 2023 09:19 IST

ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే, వెంటనే ఆ సమాచారాన్ని లొకేషన్‌తో సహా కుటుంబ సభ్యులకు చేరవేసేలా రిధిమా ఠాకుర్‌ అనే పదో తరగతి విద్యార్థిని స్మార్ట్‌ హెల్మెట్‌ను రూపొందించింది. హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన రిధిమా, తాను రూపొందించిన స్మార్ట్‌ హెల్మెట్‌ను రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రదర్శనకు ఉంచింది. హెల్మెట్‌ను ధరించడం మర్చిపోయినా, సరిగ్గా ధరించకపోయినా బీప్‌ శబ్దంతో ఇది అప్రమత్తం చేస్తుంది. ఇందులో కెమెరా, లొకేషన్‌ ట్రాకర్‌, సెన్సర్లు, ట్రాన్స్‌మిటర్‌, రిసీవర్‌ వ్యవస్థలు, జీఎస్‌ఎం సిమ్‌ను అమర్చుకునే వెసులుబాటు ఉన్నాయి. ఏదైనా ప్రమాదం జరిగి హెల్మెట్‌ కిందపడితే లేదా దేన్నైనా ఢీకొంటే, వెంటనే అందులోని ప్రెజర్‌ ప్లేట్‌ టెక్నిక్‌ సాయంతో, ముందే సేవ్‌ చేసుకున్న ఫోన్‌ నంబర్లకు కాల్‌ లేదా మెసేజ్‌ వెళ్తుంది. ఎవరైనా అనుమానితులు అనుసరిస్తున్నా లేదా ప్రమాదం పొంచి ఉన్నా హెల్మెట్‌లోని ఓ బటన్‌ను ఒత్తడం ద్వారా అత్యవసర నంబర్లకు ఫోన్‌ చేయొచ్చు. లైవ్‌ లొకేషన్‌ షేర్‌ చేయొచ్చు. ఇందులోని కెమెరా సీసీటీవీలా పనిచేస్తుంది. దీన్ని తయారు చేయడానికి రూ.8 వేల వరకూ ఖర్చయినట్లు రిధిమా తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని