CDS: వీవీఐపీ హెలికాప్టర్లలో మార్పులు..?

దేశ ప్రథమ సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ హెలికాఫ్టర్‌  ప్రమాదం తర్వాత వీవీఐపీల ప్రయాణాల్లో ప్రభుత్వం కీలక మార్పులు చేయనుంది. కీలక వ్యక్తులు ప్రయాణించే హెలికాప్టర్లలో కచ్చితంగా

Updated : 09 Jan 2022 14:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశ ప్రథమ సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ హెలికాప్టర్‌  ప్రమాదం తర్వాత వీవీఐపీల ప్రయాణాల్లో ప్రభుత్వం కీలక మార్పులు చేయనుంది. కీలక వ్యక్తులు ప్రయాణించే హెలికాప్టర్లలో కచ్చితంగా టెర్రైన్‌ అవేర్‌నెస్‌ అండ్‌ వార్నింగ్‌ సిస్టమ్‌ను అమర్చే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు ఇతర రక్షణ చర్యలను చేపట్టనున్నట్లు సమాచారం. గత నెల కూనూరు సమీపంలో సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కూలి ఆయనతో సహా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై దర్యాప్తు నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకొంది.

ఇటీవలే ఈ ప్రమాదానికి సంబంధించి వాయుసేన నిర్వహించిన దర్యాప్తు నివేదిక ప్రభుత్వానికి చేరింది. దీనిలో ఎంఐ 17వీ5 హెలికాప్టర్‌ ప్రమాదంపై సమగ్ర నివేదిక ఇచ్చింది. ప్రమాదానికి ముందు పరిస్థితులు విశ్లేషణ చేసి.. పలు సూచనలు చేసింది. దీని ఆధారంగా వీవీఐపీ హెలికాప్టర్లకు సిబ్బంది ఎంపిక, ఏవియానిక్స్‌లో మార్పులు వంటివి ఉన్నాయి.

సాధారణంగా ఫిక్స్‌డ్‌ వింగ్‌ విమానాలు కొండల వంటి వాటిని ఢీకొనకుండా టెర్రైన్‌ అవేర్‌నెస్‌ అండ్‌ వార్నింగ్‌ సిస్టమ్‌ ఉంటుంది. కానీ, వీవీఐపీలు ప్రయాణించే హెలికాప్టర్లలో ఈ వ్యవస్థ లేదు. వాస్తవానికి హెలికాప్టర్ల కోసం మార్కెట్లో ఈ వ్యవస్థలు విరివిగా లభిస్తున్నాయి. వాతావరణం, వెలుతురు సరిగా లేని సమయంలో ప్రయాణించేందుకు వీటిని వాడతారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని