I-Day: స్వాతంత్య్ర వేడుకల వేళ పంజాబ్‌లో ఉగ్రముఠా కుట్రలు భగ్నం!

స్వాతంత్ర్య వేడుకలకు యావత్‌ దేశం సిద్ధమైన వేళ పంజాబ్‌లో ఉగ్ర ముఠా కలకలం రేపింది. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ మద్దతుదారుల.......

Published : 15 Aug 2022 01:52 IST

చండీగఢ్‌: స్వాతంత్ర్య వేడుకలకు యావత్‌ దేశం సిద్ధమైన వేళ పంజాబ్‌లో ఉగ్ర ముఠా కలకలం రేపింది. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ మద్దతుదారుల కుట్రలను భగ్నం చేసిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు హ్యాండ్‌ గ్రనేడ్లు, ఒక ఐఈడీ, రెండు పిస్టోళ్లు, 40 క్యాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌ను పంజాబ్ -దిల్లీ పోలీసులు సంయక్తంగా నిర్వహించారు. ‘‘స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ పంజాబ్‌ పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశాం. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ మద్దతు కలిగిన నలుగురు ఉగ్రవాదులను దిల్లీ పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నాం. కెనడాకు చెందిన అర్ష్ డల్లా, ఆస్ట్రేలియాకు చెందిన గుర్జంత్ సింగ్‌తో సంబంధం ఉన్న నలుగురిని అరెస్టు చేశాం’’ అని పంజాబ్‌ పోలీసులు ట్విటర్‌లో వెల్లడించారు. ఆ ముఠా నుంచి మూడు హ్యాండ్‌ గ్రనేడ్లు (పి-86), ఐఈడీ, రెండు 9ఎం.ఎం. పిస్టోళ్లు, 40 కాట్రిడ్జ్‌లు సీజ్‌ చేసినట్టు పేర్కొన్నారు. సోమవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగనున్న వేళ పంజాబ్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని