Jammu Kashmir: కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఆర్మీ అధికారి వీర మరణం

కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి చెలరేగారు. రాజౌరి జిల్లాలోని ఠాణామండీ ప్రాంతంలో గురువారం ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఓ జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి(జేసీవో) అమరుడయ్యారు. మరొకరికి గాయాలయ్యాయి...

Updated : 19 Aug 2021 15:51 IST

మరొకరికి గాయాలు, ఒక ఉగ్రవాది హతం

శ్రీనగర్‌: కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి చెలరేగారు. రాజౌరి జిల్లాలోని ఠాణామండీ ప్రాంతంలో గురువారం ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఓ జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి(జేసీవో) అమరుడయ్యారు. మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఒక ఉగ్రవాది సైతం హతమైనట్లు అధికారులు వెల్లడించారు. ‘ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో భద్రతాదళాలు బుధవారం కార్డన్‌ సెర్చ్‌ మొదలుపెట్టాయి. ఈ క్రమంలో గురువారం ఉదయం కార్యోట్‌ కలాస్‌ ప్రాంతంలో వారు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య ఫైరింగ్‌ మొదలైందని’ని వివరించారు. ఉగ్రవాదులంతా నియంత్రణ రేఖ దాటి ఈ ప్రాంతంలోకి చొరబడ్డారని డీజీపీ దిల్‌బాగ్ సింగ్ తెలిపారు. ఎంతమంది వచ్చారో తెలియదని, ఎన్‌కౌంటర్ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. కొన్ని వారాలుగా రాజౌరి సెక్టార్‌లో వరుస ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. ఆగస్టు 6న సైతం ఈ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని