Kashmir: పాకిస్థాన్‌ కర్నల్‌ రూ.30 వేలు ఇచ్చి కశ్మీర్‌ పంపాడు!

భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన ఓ ఉగ్రవాదిని సైన్యం అరెస్టు చేసి విచారించగా ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.  ఆగస్టు 21వ తేదీన కశ్మీర్‌లోని నౌషారా సెక్టార్‌ వద్ద

Updated : 25 Aug 2022 10:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన ఓ ఉగ్రవాదిని సైన్యం అరెస్టు చేసి విచారించగా ఆసక్తికరమైన విషయాలు బయటికొచ్చాయి. ఆగస్టు 21న కశ్మీర్‌లోని నౌషారా సెక్టార్‌ వద్ద జంగర్‌ అనే ప్రదేశంలో కొందరు ఉగ్రవాదులను భారత సైన్యం గమనించింది. వారు కంచెను కత్తిరిస్తుండగా దళాలు అప్రమత్తమై దాడి చేశాయి. ఈ ఘటనలో ఒక ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నాయి. అతడిని పీవోకేలోని కోటిల్‌ జిల్లాకు చెందిన తబ్రక్‌ హుస్సేన్‌గా గుర్తించారు. పాకిస్థాన్‌కు చెందిన ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ కర్నల్‌ యూనస్‌ చౌధ్రీ అనే వ్యక్తి 30 వేల పాకిస్థానీ రూపాయలు ఇచ్చి తబ్రక్‌ను భారత్‌లో ఆత్మాహుతి దాడి చేసేందుకు పంపినట్లు తేలింది. ఆగస్టు 21 కంటే ముందు హుస్సేన్‌ భారత సరిహద్దు వద్ద రెక్కీలు నిర్వహించాడు. 

2016లో తబ్రక్‌ హుస్సేన్‌ అతడి సోదరుడు భారత్‌లోకి చొరబడ్డారు. అప్పట్లో సైన్యం వీరిని అరెస్టు కూడా చేసింది. కానీ, ఆ తర్వాత మానవీయ కారణాలతో వారిని తిరిగి పాకిస్థాన్‌కు పంపించింది. కానీ, అతడు బుద్ధి మార్చుకోకుండా ఈ సారి పాక్‌ కర్నల్‌ వద్ద డబ్బు తీసుకొని తిరిగి భారత్‌పై ఆత్మాహుతి దాడికి రావడం గమనార్హం.

ఆగస్టు 22న లామ్‌ సెక్టార్‌ వద్ద మరో ముగ్గురు ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించేందుకు యత్నించారు. ఆ సమయంలో వారు భారత్‌ దళాలు మందుపాతరలు అమర్చిన ప్రదేశంలోకి ప్రవేశించారు. దీంతో అక్కడ ల్యాండ్‌మైన్లు పేలి ఇద్దరు ఉగ్రవాదులు మరణించగా.. మరోకరు తీవ్రంగా గాయపడినట్లు గుర్తించారు. వారి మృతదేహాల వద్ద ఒక ఏకే - 56 రైఫిల్‌, బుల్లెట్లు, రేషన్‌ దొరికాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని