మాస్కు ధరించలేదని థాయ్ ప్రధానికి జరిమానా!
దిల్లీ, బ్యాంకాక్: అధికారులతో సమావేశం సందర్భంగా మాస్కు ధరించనందుకు గాను... థాయ్‌లాండ్ ప్రధానమంత్రి జనరల్ ప్రయూత్ చాన్-వో-చాకు అధికారులు 6 వేల భాట్ల (సుమారు రూ.14,270) జరిమానా విధించారు! దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా థాయ్ సర్కారు కఠిన చర్యలు తీసుకుంటోంది. భారత్ నుంచి థాయ్ ప్రజలు మినహా మరెవరూ తమదేశం రావద్దని ఆంక్షలు విధించింది. మే 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. ఇక బ్యాంకాక్ మెట్రోపాలిటన్ అడ్మినిస్ట్రేషన్ నిబంధనల ప్రకారం... రాజధానిలో ఇల్లు దాటి బయటకు వచ్చే ప్రతి వ్యక్తి మాస్కు ధరించడం తప్పనిసరి. దీన్ని ఉల్లంఘించే వారికి 20,000 భాట్ల (రూ.47,610) వరకూ జరిమానా విధిస్తారు. వ్యాక్సిన్ కొనుగోలు విషయమై ప్రధాని ప్రయూత్ సోమవారం సలహాదారులతో సమావేశమయ్యారు. ఆ సమయంలో ఆయన మాస్కు ధరించలేదు. ఈ విషయంపై తానే అధికారులకు ఫిర్యాదు చేసినట్టు బ్యాంకాక్ గవర్నర్ అశ్విన్ క్వాన్‌ముయాంగ్ తన ఫేస్బుక్ ఖాతాలో వెల్లడించారు. కాసేపట్లోనే ఇది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ప్రధాని తీరుపై ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో... ప్రయూత్‌కు అధికారులు జరిమానా విధించారు. కాగా, థాయ్‌లాండ్ పౌరులు మినహా మిగతా వారికి తమ దేశంలో ప్రవేశించేందుకు ఇచ్చే ప్రవేశ ధ్రువీకరణ పత్రాల (సీవోఈ) మంజూరును మే 1 నుంచి రద్దు చేస్తున్నట్టు దిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయం ప్రకటించింది. ఇది భారతీయులకూ వర్తిస్తుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Yuan Wang 5: అభ్యంతరం తెలుపుతున్నప్పటికీ.. చైనా నౌకకు శ్రీలంక మరోమారు అనుమతి
-
Sports News
MS Dhoni : దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో మెంటార్‌గా ధోనీ సేవలు ఈసారికి కష్టమే!
-
India News
Uddhav Thackeray: ‘త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడం వల్ల దేశ భక్తులు కాలేరు’
-
Movies News
social look: ‘మిస్బి’గా తమన్నా.. నిఖిల్ రిక్వెస్ట్.. శునకానికి సోనూ ట్రైనింగ్..
-
Politics News
BJP: ఎన్నికల్లో పోటీ చేస్తా.. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా రెడీ: జీవితా రాజశేఖర్
-
General News
cardiac: ఛాతీలో నొప్పిగా ఉందా..? ఎందుకో తెలుసుకోండి..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Tunnel: బ్యాంకు లూటీకి ఏకంగా సొరంగం తవ్వకం.. ఆపై ఊహించని ఘటన!
- Bangladesh Cricket : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అనూహ్య నిర్ణయం..
- Chennai: విమానంలో వచ్చిన ప్రయాణికుడి వద్ద కొండచిలువలు, తాబేళ్లు, కోతి!
- BJP: ఎన్నికల్లో పోటీ చేస్తా.. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా రెడీ: జీవితా రాజశేఖర్
- MS Dhoni : దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో మెంటార్‌గా ధోనీ సేవలు ఈసారికి కష్టమే!
- Uddhav Thackeray: ‘త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడం వల్ల దేశ భక్తులు కాలేరు’
- cardiac: ఛాతీలో నొప్పిగా ఉందా..? ఎందుకో తెలుసుకోండి..!
- Viral Video: క్షణం ఆలస్యమైనా పాము కాటేసేదే..! అంతలో ఏం జరిగిందంటే
- RRR: ఆర్ఆర్ఆర్ టీమ్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన గూగుల్.. ఏం చేసిందంటే?
- Yuan Wang 5: అభ్యంతరం తెలుపుతున్నప్పటికీ.. చైనా నౌకకు శ్రీలంక మరోమారు అనుమతి