
7 రాష్ట్రాలు.. 17లక్షల యాక్టివ్ కేసులు!
దిల్లీ: భారత్‌లో కరోనా వ్యాప్తి అంతకంతకూ ఉద్ధృతమవుతోంది. నిన్న ఒక్కరోజే 3.46లక్షల కొత్త కేసులు, 2624 మరణాలు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల గ్రాఫ్ భారీగా పెరిగిపోతోంది. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. దేశంలో ప్రస్తుతం 25,52,940 యాక్టివ్ కేసుల్లో 17లక్షలకు పైగా (దాదాపు 67శాతం) కేసులు కేవలం ఏడు రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం. మహారాష్ట్రలో అత్యధికంగా 6.93లక్షలకు పైగా క్రియాశీల కేసులు ఉండగా.. యూపీలో 2.73లక్షలు, కర్ణాటక 2.14 లక్షలు, కేరళ 1.79లక్షలు, ఛత్తీస్‌గఢ్ 1.23లక్షలు, రాజస్థాన్ 1.17లక్షలు, గుజరాత్‌లో లక్షకు పైగా క్రియాశీల కేసులు ఉన్నాయి.
కరోనా మృత్యుకేళి: టాప్ 10 రాష్ట్రాలివే..
అలాగే, దేశంలో కరోనా మరణమృదంగం కొనసాగుతోంది. ఇప్పటివరకు కరోనా విలయానికి బలైన వారి సంఖ్య 1,89,544కి పెరిగింది. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం నిన్న నమోదైన మరణాల్లో 82% కేవలం 11 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోనే కావడం గమనార్హం. మహారాష్ట్రలో అత్యధికంగా 773 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆ తర్వాత దిల్లీలో 348మంది, ఛత్తీస్‌గఢ్‌లో 219 మంది, యూపీ 196, కర్ణాటక 190, గుజరాత్ 142, తమిళనాడు 78, పంజాబ్ 75, మధ్యప్రదేశ్ 74, రాజస్థాన్ 64 చొప్పున కొవిడ్ కారణంగా మృతిచెందారు. మరోవైపు, 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణమూ నమోదు కాలేదని కేంద్రం తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, సిక్కిం, నాగాలాండ్, త్రిపుర, మేఘాలయా, మిజోరం, లద్దాఖ్, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ, అండమాన్ నికోబార్ దీవుల్లో కరోనా కారణంగా ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. దేశంలో ప్రస్తుతం మరణాల రేటు 1.14శాతంగా ఉంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.