Anand mahindra: ఇంతలా నిరుత్సాహపరిచే వీడియో ఇంతవరకు చూడలేదు..!

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా(Anand mahindra) నెట్టింట్లో ఓ వీడియో చేశారు. అందులో ఉన్న దృశ్యాల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

Published : 04 May 2023 01:43 IST

ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా(Anand mahindra) నెట్టింట్లో చురుగ్గా ఉంటారు. ఆయన షేర్ చేసే సందేశాలు వినోదాత్మకంగా ఉండటమే కాకుండా విజ్ఞానాన్ని పంచుతాయి. అలాగే ప్రపంచంలో అందుబాటులో ఉన్న సరికొత్త సాంకేతికతను, సౌకర్యాలను వాటి ద్వారా వెల్లడిస్తుంటారు. ఆ తరహాలో తాజాగా షేర్ చేసిన వీడియో క్లిప్‌ ఆకట్టుకుంటోంది. ఒక ట్రైన్ జర్నీ ఇంత విలాసవంతంగా ఉంటుందా..? అనిపిస్తోంది. 

‘ఈ వీడియో క్లిప్ నా వద్దకు పలుమార్లు వచ్చింది. ఆధునిక ప్రపంచంలో రైలు ప్రయాణంలో ఉన్న సౌకర్యాలను వెల్లడిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ ప్రయాణాన్ని విలాసవంతంగా, పరిశుభ్రంగా ఉంచేందుకు ఎన్ని ఉత్పత్తులు ఉన్నాయో కనిపిస్తోంది. నా జీవితంలో వ్యక్తిగతంగా ఇంతగా నిరుత్సాహపరిచే వీడియో ఎన్నడూ చూడలేదు. ఆధునిక జీవన విధానంలో అనవసర వస్తువుల అతివినియోగాన్ని ఇది చూపిస్తోంది. అవి భూగ్రహంపై ఉన్న చెత్తగుట్టల పరిణామాన్ని మరింత పెంచుతాయి’ అని మహీంద్రా(Anand mahindra) ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నచిన్న వస్తువులతో ఓ యువతి రైలులో విలాసవంతంగా ప్రయాణించడం అందులో కనిపిస్తోంది. ఆ లగ్జరీ చూస్తే ఆశ్చర్యం కలగకమానదు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని