Farooq Abdhullah: దేశ విభజన.. జిన్నా చేసిన అనుచిత డిమాండ్‌: ఫరూఖ్‌ అబ్దుల్లా

మతం ప్రాతిపదికన దేశాన్ని రెండుగా విభజించడం చారిత్రక తప్పిదమని రాజ్‌నాథ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు, జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా సమర్థించారు. సోమవారం ఆయన మీడియాతో మట్లాడుతూ.. దేశ విభజన జరగకపోయి ఉంటే.. రెండు వర్గాలు(హిందూ, ముస్లింలు) శాంతియుతంగా

Published : 14 Dec 2021 02:05 IST

శ్రీనగర్‌: మతం ప్రాతిపదికన దేశాన్ని రెండుగా విభజించడం చారిత్రక తప్పిదమని రాజ్‌నాథ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు, జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం ఫరూఖ్‌ అబ్దుల్లా సమర్థించారు. సోమవారం ఆయన మీడియాతో మట్లాడుతూ.. దేశ విభజన జరగకపోయి ఉంటే.. రెండు వర్గాలు(హిందూ, ముస్లింలు) శాంతియుతంగా ఉండేవని.. దీంతో భారత్‌ మరింత శక్తివంతంగా మారేదని అన్నారు. 

‘‘మత ప్రాతిపదికన దేశ విభజన జరగడం కచ్చితంగా చారిత్రక తప్పిదమే. పాకిస్థాన్‌ కావాలనడం మహమ్మద్‌ అలీ జిన్నా చేసిన అనుచితమైన డిమాండ్‌. అప్పుడు ముస్లింలకు 26 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాల్సిన చోట 39శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని జిన్నా పట్టుబట్టారు. ఆ సమయంలో కాంగ్రెస్‌ అందుకు అంగీకరించలేదు. దీంతో ఆయన దేశ విభజనకు మొగ్గుచూపారు. ఈ విభజన వల్ల కేవలం కశ్మీరీలేకాదు.. భారత్‌లో ఉన్న ముస్లింలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశం ఒక్కటిగా ఉండి ఉంటే.. ఈ కష్టాలు ఉండేవి కావు. మనమంతా ఐక్యంగా, సోదరభావంతో ఉండేవాళ్లం. కానీ, భారత్‌.. పాకిస్థాన్ విభేదాల కారణంగా ఇప్పుడు మతపరమైన సమస్యలు పెరుగుతున్నాయి’’అని ఫరూఖ్‌ అబ్దుల్లా చెప్పుకొచ్చారు.

దిల్లీలో నిర్వహిస్తున్న ‘స్వర్ణిమ్‌ విజయ్‌ పర్వ్‌’ ప్రారంభ కార్యక్రమంలో ఆదివారం రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రసంగిస్తూ.. స్వాతంత్య్రానికి ముందు మత ప్రాతిపదికన భారత్‌ను విభజించడం చారిత్రక తప్పిదమనడానికి 1971 యుద్ధం నిదర్శనమని పేర్కొన్నారు. మన దేశాన్ని ముక్కలు ముక్కలు చేయాలన్న దుష్ట తలంపుతో ఉగ్రవాదాన్ని, భారత వ్యతిరేక శక్తులను పాక్‌ ప్రోత్సహిస్తోందని ఆరోపించారు.

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని