Prabhakar Sail: ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అంత అకస్మాత్తుగా ఎలా చనిపోతాడు..?

ముంబయి క్రూజ్ డ్రగ్స్ కేసులో కీలక సాక్షి ప్రభాకర్ సెయిల్ (37) మృతి చెందడంపై మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.

Published : 03 Apr 2022 01:38 IST

ముంబయి: ముంబయి క్రూజ్ డ్రగ్స్ కేసులో కీలక సాక్షి ప్రభాకర్ సెయిల్ (37) మృతి చెందడంపై మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ప్రభాకర్ మృతిపై విచారణ జరిపిస్తామని హోం మంత్రి దిలీప్ వాల్షే పాటిల్ వెల్లడించారు. ‘ఆరోగ్యంగా, దృఢంగా ఉన్న ఒక వ్యక్తి అంత అకస్మాత్తుగా ఎలా మరణిస్తాడు?’ అంటూ మంత్రి వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తారన్నారు. 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్రూజ్ కేసులో ప్రభాకర్ కీలక సాక్షిగా ఉన్నారు. ఈ కేసులో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌ను ఎన్‌సీబీ కస్టడీలోకి తీసుకుంది. ఈ కేసులో సాక్షిగా ఉన్న ప్రభాకర్ తర్వాత ఎన్‌సీబీపైనే ఆరోపణలు చేశారు. అప్పటి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నుంచి తనకు ప్రాణహాని ఉందని, ముడుపుల వ్యవహారం నడుస్తోందని కోర్టులో అఫిడవిట్ కూడా సమర్పించారు. ఇలా ఈ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతుండగా..  అతడు శుక్రవారం తన ఇంట్లో మృతి చెందారు. ఈ విషయాన్ని అతడి తరఫు న్యాయవాది వెల్లడించారు. అతడి మృతిపై కుటుంబ సభ్యులు ఎవరిమీద అనుమానం వ్యక్తం చేయడం లేదని చెప్పారు. ప్రభాకర్ ముంబయిలో ఒక అద్దె ఇంట్లో ఉంటున్నారు. అతడికి తల్లి, భార్య, ఇద్దరు పిల్లలున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని