Mansukh Mandaviya: 15 ఏళ్లలోపు పిల్లలకు కరోనా టీకా.. మాండవీయ ఏం చెప్పారంటే..?

కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతుండటంతో దేశవ్యాప్తంగా పాఠశాలలన్నీ దాదాపుగా తెరుచుకుంటున్నాయి.

Published : 08 Feb 2022 19:01 IST

దిల్లీ: కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతుండటంతో దేశవ్యాప్తంగా పాఠశాలలన్నీ దాదాపుగా తెరుచుకున్నాయి. ఈ క్రమంలో టీకా అందని 15 ఏళ్లలోపు పిల్లలపై వైరస్ ప్రభావం ఏవిధంగా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనిపై సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ రాజ్యసభలో సమాధానం ఇచ్చారు. నిపుణుల బృందం సూచనల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం పిల్లలకు టీకాలు ఇచ్చే విషయంలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. 

‘15 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సువారిలో 67 శాతం మందికి మొదటి డోసు అందింది. దేశంలో టీకా కార్యక్రమం వేగంగా సాగుతోంది. 15 ఏళ్లలోపు పిల్లలకు టీకా ఇచ్చే విషయంలో నిపుణుల సూచన ఆధారంగానే నిర్ణయం ఉంటుంది. ఈ బృందం క్రమం తప్పకుండా సమావేశమవుతుండగా.. అది ఇచ్చే సలహాల ఆధారంగా ప్రభుత్వ చర్యలు తీసుకుంటోంది’ అని మంత్రి వెల్లడించారు. 

అలాగే కొవిడ్ టీకా సామర్థ్యంపై మరో సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ‘వ్యాక్సినేషన్ మరణాలు, ఆసుపత్రుల్లో చేరికను విజయవంతంగా తగ్గిస్తోంది. ఈ విషయాన్ని ఐసీఎంఆర్‌తో పాటు అంతర్జాతీయ సంస్థలు వెల్లడించాయి’ అని మంత్రి తెలిపారు. భారత్‌లో ఇప్పటివరకు 97.5 శాతం మంది అర్హులు మొదటి డోసు తీసుకోగా.. 77 శాతం మందికి రెండు డోసులు  అందాయన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈ స్థాయిలో టీకా డోసుల పంపిణీ జరగలేదన్నారు. భారత్‌ కరోనా సంక్షోభాన్ని మెరుగ్గా పరిష్కరిస్తోందని చెప్పారు. అలాగే టీకా కార్యక్రమం వల్లే మూడో ముప్పును ఎదుర్కోగలిగిందన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని