Kumbalangi: శానిటరీ నాప్కిన్‌ రహితంగా కుంబలంగి..దేశంలోనే తొలి గ్రామంగా ఘనత

దేశంలోనే తొలి శానిటరీ నాప్కిన్‌ రహిత గ్రామంగా కేరళలోని కుంబలంగి నిలిచింది. ఎర్నాకులం జిల్లాలోని ఈ చిన్న లంక గ్రామంలో మహిళలు నాప్కిన్ల స్థానంలో మెన్‌స్ట్రువల్‌ కప్స్‌

Updated : 15 Jan 2022 08:05 IST

ఎర్నాకులం: దేశంలోనే తొలి శానిటరీ నాప్కిన్‌ రహిత గ్రామంగా కేరళలోని కుంబలంగి నిలిచింది. ఎర్నాకులం జిల్లాలోని ఈ చిన్న లంక గ్రామంలో మహిళలు నాప్కిన్ల స్థానంలో మెన్‌స్ట్రువల్‌ కప్స్‌ వాడుతుండటంతో ఈ ఘనత సాధించింది. ఫహద్‌ ఫాజిల్‌ నటించిన ‘కుంబలంగి నైట్స్‌’ సినిమా ద్వారా కుంబలంగి గ్రామం ఇదివరకే ప్రాచుర్యం పొందింది. ఇదేచోట అమలుచేసిన ‘అవల్కాయి’ (ఆమె కోసం) అనే కార్యక్రమం విజయవంతమై మరోసారి వార్తల్లో నిలిచింది. అవల్కాయి కార్యక్రమాన్ని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ సాయంతో ఇక్కడ అమలుచేశారు. మహిళలు రుతుస్రావం సమయంలో నాప్కిన్ల స్థానంలో మెన్‌స్ట్రువల్‌ కప్స్‌ వాడేలా అవగాహన కల్పించారు. 18 ఏళ్లు పైబడిన మహిళలకు ఇప్పటికే 5 వేలకు పైగా మెన్‌స్ట్రువల్‌ కప్స్‌ పంపిణీ చేశారు. శానిటరీ నాప్కిన్‌తో పోలిస్తే ఈ కప్స్‌ చాలా తక్కువ ధరకే లభించటం, పర్యావరణహితంగా ఉండటం వంటి ఉపయోగాలను వివరించారు. గురువారం కుంబలంగిలో నిర్వహించిన కార్యక్రమంలో కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ పాల్గొని.. శానిటరీ నాప్కిన్‌ రహిత గ్రామంగా ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు