indigenous howitzer: ఎర్రకోట వద్ద గర్జించిన స్వదేశీ శతఘ్నులు..!

భారత్‌ స్వాంతంత్ర్య దినోత్సవం రోజున ఎర్రకోట వద్ద దేశీయంగా అభివృద్ధి చేసిన ఏటీఏజీఎస్‌ (అడ్వాన్స్‌డు టౌడ్‌ ఆర్టిలెరీ గన్‌ సిస్టమ్‌)  ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 21-గన్‌ సెల్యూట్‌ కోసం బ్రిటన్‌కు చెందిన 25 బ్రిటన్‌ శఘ్నులతో

Updated : 15 Aug 2022 15:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎర్రకోట వద్ద దేశీయంగా అభివృద్ధి చేసిన ఏటీఏజీఎస్‌ (అడ్వాన్స్‌డ్‌ టౌడ్‌ ఆర్టిలెరీ గన్‌ సిస్టమ్‌)  ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 21-గన్‌ సెల్యూట్‌ కోసం 25 బ్రిటన్‌ శతఘ్నులతో కలిపి రెండు ఏటీజీఏఎస్‌లను కూడా వినియోగించారు. ఏటీఏజీఎస్‌లను ఈ వేడుకల కోసం వినియోగించడం ఇదే తొలిసారి. వీటిని డీఆర్‌డీవో.. టాటా ఏరోస్పెస్‌, భారత్‌ ఫోర్జ్‌తో కలిసి అభివృద్ధి చేసింది. 

ప్రధాని మోదీ ప్రసంగంలో ఆత్మనిర్భర్‌ భారత్‌ను వివరిస్తూ ఈ శతఘ్నుల గురించి చెప్పారు. ‘‘75ఏళ్ల స్వాతంత్య్రభారత్‌లో తొలిసారి మేడ్‌ ఇన్‌ ఇండియా శతఘ్నులను 21 తుపాకుల వందనానికి వినియోగించారు. ఈ శతఘ్నుల చప్పుడుతో భారత ప్రజలు మొత్తం స్ఫూర్తి పొందాలి. ఆత్మనిర్భర్‌ భారత్‌ను చాలా జాగ్రత్తగా భుజస్కందాలపై మోస్తున్న భారత దళాలకు ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉంది’’ అని పేర్కొన్నారు.

ఈ సరికొత్త ఏటీఏజీఎస్‌ 155ఎంఎంX53 క్యాలిబర్‌ గన్‌ అభివృద్ధిలో డీఆర్‌డీవోలోని ఆర్మమెంట్‌ రీసెర్చి అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ఏఆర్‌డీఈ) నోడల్‌ ఏజెన్సీగా పనిచేసింది. ఈ శతఘ్ని 2017లో పోఖ్రాన్‌ ఫైరింగ్‌ రేంజిలో నిర్వహించిన పరీక్షల్లో 48 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించింది. ప్రస్తుతం దీని పనితీరును డైరెక్టర్‌ జనరల్‌ క్వాలిటీ ఎష్యూరెన్స్‌ విభాగం అంచనావేస్తోంది. ఇది పూర్తయితే సైన్యం కొనుగోళ్లకు ఆర్డర్లు ఇస్తుంది.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts