
హమాస్ ఆత్మాహుతి సబ్‌మెరైన్ ధ్వంసం..!
ఇంటర్నెట్‌డెస్క్: హమాస్‌కు చెందిన అత్యంత కీలకమైన ఆయుధాన్ని తాము ధ్వంసం చేసినట్లు ఇటీవల ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియోలను సోమవారం షేర్ చేసింది. సముద్ర జలాల్లో ఇజ్రాయెల్ గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలను, ఇతర సాధన సంపత్తిని ధ్వంసం చేయడానికి ఉపయోగించే డ్రోన్ జలాంతర్గామిని నాశనం చేసినట్లు పేర్కొంది. గాల్లో నుంచి తీసిన ఈ ఫుటేజీలో తొలుత ఒక బాంబు సముద్ర జలాల్లో పడి భారీ విస్పోటం సృష్టించగా.. రెండో ఫుటేజీలో సమీపంలో కారుపై క్షిపణి పడుతున్నట్లు ఉంది.
చమురు క్షేత్రంపై దాడికి యత్నం..?
వాస్తవానికి ఈ డ్రోన్ సబ్‌మెరైన్‌తో హమాస్ ఏం ప్రణాళిక వేసిందో మాత్రం ఐడీఎఫ్ వెల్లడించలేదు. కానీ, అంతకు ముందు హమాస్ సముద్రంలోని ఒక నౌకపై, ఇజ్రాయెల్‌కు చెందిన టమర్ గ్యాస్ క్షేత్రాన్ని లక్ష్యంగా చేసుకొని రాకెట్లు ప్రయోగించిందని డెయిలీ మెయిల్ పత్రిక కథనంలో పేర్కొంది. అష్కెలాన్ పట్టణం నుంచి టమర్ గ్యాస్ క్షేత్రం కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఈ డ్రోన్ సబ్‌మెరైన్‌లో దాదాపు 70 కిలోల పేలుడు పదర్థాన్ని పెట్టి లక్ష్యం వైపు నడిపిస్తారు. దీనిని జీపీఎస్ సాయంతో ఆపరేట్ చేయవచ్చు. ఐడీఎఫ్ దాడిలో దీనిని ఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులు కూడా మరణించారు.