IndiGo: గగనతలంలో ప్రయాణికుడి అసభ్య ప్రవర్తన.. ఇండిగో విమానంలో ఘటన
ఇండిగో(Indigo) విమాన ప్రయాణంలో ఓ యువకుడు హద్దుమీరి ప్రవర్తించాడు. మహిళా సిబ్బందిపై వేధింపులకు పాల్పడ్డాడు. అసలు ఏం జరిగిందంటే..?
ముంబయి: గగనతలంలో ఓ ప్రయాణికుడు విచక్షణ కోల్పోయాడు. ఎయిర్‌హోస్టెస్( IndiGo air hostess)తో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు తోటి ప్రయాణికులపై దాడి చేశాడు. బ్యాంకాక్ నుంచి ముంబయికి వస్తోన్న ఇండిగో(Indigo) విమానంలో ఈ ఘటన జరిగింది.
విమానంలో ఆహారం అందుబాటులో లేదని ఎయిర్‌హోస్టెస్ చెప్పగా.. సదరు ప్రయాణికుడు అనుచితంగా ప్రవర్తించడం ప్రారంభించాడని సమాచారం. ఆ తర్వాత చికెన్ డిష్ తీసుకోవడానికి అంగీకరించాడు. పేమెంట్ నిమిత్తం అతడివద్దకు ఆమె పీఓఎస్ మెషిన్ తీసుకెళ్లారు. కార్డు స్వైపింగ్ వంకతో ఆమెను అసభ్యంగా తాకాడు. దానిపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఆ వ్యక్తి సీటు నుంచి లేచి, అందరి ముందు వేధించాడు. ఈ మేరకు ఆమె ముంబయి పోలీసులకు వెల్లడించింది. అతడు అక్కడితో ఆగకుండా ఇతర సిబ్బందిని, తోటి ప్రయాణికులను ఇబ్బందిపెట్టాడని ఫిర్యాదు చేశారు. విమానం ముంబయికి చేరుకోగానే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు స్వీడన్ జాతీయుడైన 62 ఏళ్ల క్లాస్ ఎరిక్ ఎరాల్డ్ జొనాస్ వెస్ట్‌బర్గ్ అని పోలీసులు తెలిపారు. తర్వాత కోర్టు ముందు ప్రవేశపెట్టారు. కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది.
ఈ మధ్యకాలంలో విమానాల్లో ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తిస్తోన్న ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం ఎయిరిండియా(AirIndia) విమానంలో మూత్ర విసర్జన ఘటన తీవ్ర వివాదాస్పదమైంది. ఇక ఇటీవల గువాహటి నుంచి దిల్లీ వెళుతున్న విమానంలో ఓ వ్యక్తి తప్పతాగి తన సీటు పక్కనే వాంతులు చేసుకున్నాడు. టాయిలెట్ వద్ద మలవిసర్జన చేశాడు. దీంతో విమానంలోని సిబ్బంది, తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీనికి సంబంధించిన ఫొటోను అదే విమానంలో ప్రయాణిస్తున్న ఓ న్యాయవాది ట్విటర్‌లో పోస్టు చేసి ఆవేదన వ్యక్తం చేయడంతో విషయం వెలుగుచూసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మరో శుభవార్త
-
Rohit On WC 2023: మా టార్గెట్ అదే.. అలాంటి పోలికలను పట్టించుకోం: రోహిత్
-
TS News: తెలంగాణలో ఓటర్ల జాబితా విడుదల.. వర్గాల వారీగా ఇదీ లెక్క!
-
Devara: ‘దేవర’.. ఒక్క సంభాషణా కట్ చేయలేం.. పార్ట్ 2 ప్రకటించిన కొరటాల శివ
-
Rahul Gandhi: అమ్మకు రాహుల్ సర్ప్రైజ్ గిఫ్ట్.. ఏమిచ్చారంటే..?
-
Supriya Sule: ‘హనీమూన్’ ముగియక ముందే.. మహా ప్రభుత్వంలో ముసలం?