Modi: అదే.. భారత్‌ను ‘ఫార్మసీ ఆఫ్‌ ది వరల్డ్‌’గా నిలిపింది: మోదీ

కరోనా సమయంలో భారత ఫార్మసీ రంగం మరింత అభివృద్ధి చెందిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కరోనా తొలినాళ్లలో భారత్‌ 150 దేశాలకు వివిధ ఔషధాలు, వైద్య పరికరాలను ఎగుమతి చేసిందని, ఈ ఏడాది  100 దేశాలకు 65 మిలియన్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసిందని గుర్తు చేశారు. దిల్లీలో నిర్వహించిన

Published : 18 Nov 2021 23:01 IST

దిల్లీ: కరోనా సంక్షోభంలో ఎదురైన సవాళ్లను అధిగమించి భారత ఫార్మసీ రంగం మరింత అభివృద్ధి చెందిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కరోనా తొలినాళ్లలో భారత్‌ 150 దేశాలకు వివిధ ఔషధాలు, వైద్య పరికరాలను ఎగుమతి చేసిందని, ఈ ఏడాది 100 దేశాలకు 65 మిలియన్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసిందని గుర్తు చేశారు. దిల్లీలో నిర్వహించిన తొలి ‘గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ సమిట్‌’లో పాల్గొన్న మోదీ.. ఫార్మా, ఆరోగ్య రంగాలపై ప్రసంగించారు. భారత ఆరోగ్య రంగం.. ప్రపంచ దేశాల నమ్మకాన్ని చూరగొందని, అందుకే భారత్‌.. ‘ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్‌’గా నిలిచిందని చెప్పారు.

‘‘భారత్‌లో అందుబాటు ధరలోనే నాణ్యమైన ఔషధాలను భారీస్థాయిలో ఉత్పత్తి చేయగలం. అదే ప్రపంచమంతా భారత్‌వైపు చూసేలా చేసింది. 2014 నుంచి ఇప్పటి వరకు భారత ఆరోగ్య రంగం 12 బిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడులను సాధించింది’’అని ప్రధాని తెలిపారు. ఫార్మా పరిశ్రమను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లగల సామర్థ్యం ఉన్న శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు దేశంలో చాలా మంది ఉన్నారని.. ఔషధాలు, వైద్య పరికరాల ఆవిష్కరణలో భారత్‌ను అగ్రగామీగా నిలిపేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని