Abhishek Banerjee: విచారణ దిల్లీలో కాదు...కోల్‌కత్తాలో

పశ్చిమ బంగా బోగ్గు కుంభకోణంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడిని, అతని భార్యని దిల్లీలో కాకుండా కోల్‌కత్తాలో విచారించాల్సిందిగా సుప్రీంకోర్టు ఎన్‌ఫోర్సుమెంట్‌డైరెక్టరేట్‌ను ఆదేశించింది

Published : 17 May 2022 17:37 IST

బంగాల్‌ బోగ్గు కుంభకోణం విచారణలో ఈడీకి సుప్రీం ఆదేశాలు 

దిల్లీ: పశ్చిమబెంగాల్‌ బోగ్గు కుంభకోణంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడిని, అతని భార్యని దిల్లీలో కాకుండా కోల్‌కతాలో విచారించాల్సిందిగా సుప్రీంకోర్టు ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టరేట్‌ను ఆదేశించింది. బొగ్గు వ్యాపారం ద్వారా పొందిన నిధులు అక్రమంగా వినియోగించారనే విషయంలో తృణమూల్‌ పార్టీ నాయకుడు అభిషేక్‌ బెనర్జీ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఈస్ర్టన్‌ కోల్‌ఫీల్డ్‌ లిమిటెడ్‌ కునుస్టోరియా, కజోరా ప్రాంతాల్లో భారీస్థాయిలో బొగ్గు కుంభకోణం జరిగిన్నట్లు 2020 నవంబర్‌లో సీబీఐ ప్రాథమిక దర్యాప్తు నివేదికను నమోదు చేసింది. స్థానిక బొగ్గు ఆపరేటర్‌ అనుప్‌ మాఝీ(లాలా) ప్రధాన నిందితుడు. ఈ అక్రమ వ్యాపారం ద్వారా పొందిన నిధులకు బెనర్జీ లబ్ధిదారుడనే ఆరోపణలతో కేసు నడుస్తోంది. ఈవిషయంపై గత ఏడాది సెప్టెంబర్‌లో బెనర్జీ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని