Twitter: పాక్‌ ప్రభుత్వ ట్విటర్ ఖాతా.. భారత్‌లో నిలిపివేత..!

భారత్‌లో పాకిస్థాన్ ప్రభుత్వం ట్విటర్‌ ఖాతా నిలుపుదలకు గురైంది. చట్టపరమైన డిమాండ్ కారణంగా ఈ నిలుపుదల జరిగినట్లు ఆ ఖాతాలో సందేశం కనిపించింది.

Published : 01 Oct 2022 15:19 IST

దిల్లీ: పాక్‌ ప్రభుత్వ ట్విటర్‌ ఖాతా భారత్‌లో నిలిపివేతకు గురైంది. చట్టపరమైన డిమాండ్ కారణంగా ఈ చర్య చేపట్టినట్లు ఆ ఖాతాలో సందేశం కనిపించింది. శనివారం ఉదయం ఓ వార్తా ఏజెన్సీ  దీనికి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను షేర్ చేసింది. ‘భారత్‌లో పాకిస్థాన్‌ ప్రభుత్వ ట్విటర్ ఖాతాను నిలిపివేశారు’ అని పేర్కొంది.

జులైలో కూడా ఈ ఖాతాను బ్లాక్‌ చేశారు. తర్వాత పునరుద్ధరించారు. ట్విటర్ నిబంధనల ప్రకారం.. చట్టబద్ధమైన డిమాండ్‌(కోర్టు ఆదేశాలు వంటివి)కు అనుగుణంగా ఈ తరహా చర్యలు చేపడుతుంది. తాజా నిలిపివేతతో పాకిస్థాన్‌ ప్రభుత్వానికి చెందిన ఫీడ్‌.. భారత ట్విటర్ వినియోగదారులకు కనిపించదు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం 16 యూట్యూబ్ ఛానళ్లను నిషేధించింది. వీటిలో 10 భారత్‌కు చెందినవి కాగా, మరో ఆరు పాకిస్థాన్‌ కేంద్రంగా నడుస్తున్నాయి. ఓ ఫేస్‌బుక్‌ ఖాతాపైనా నిషేధం విధించింది. జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, పబ్లిక్‌ ఆర్డర్‌కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేసినందుకు ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ వెల్లడించింది.

విద్వేష సమాచార వ్యాప్తి కట్టడిలో భాగంగా ఇప్పటికే కేంద్రం పలు సామాజిక మాద్యమ ఖాతాలపై నిషేధం విధించింది. ఈ క్రమంలో  ఇప్పటి వరకూ 100 యూట్యూబ్ ఛానళ్లు, 4 ఫేస్‌బుక్‌ ఖాతాలు, 5 ట్విటర్, 3 ఇన్‌స్టాగ్రాం ఖాతాలను బ్లాక్‌ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని