Kerala Man:కొండ చీలికలో చిక్కిన యువకుడి కథ సుఖాంతం

కేరళలో మలప్పుజ సమీపంలో రెండురోజులుగా కొండ చీలికలో చిక్కుకున్న యువకుడి కథ సుఖాంతమైంది.

Updated : 21 Nov 2022 15:14 IST

పాలక్కాడ్: కేరళలో మలప్పుజ సమీపంలో రెండురోజులుగా కొండ చీలికలో చిక్కుకున్న యువకుడి కథ సుఖాంతమైంది. భారత సైన్యం చేపట్టిన సహాయక చర్యలు ఫలించడంతో అతడికి ప్రమాదం తప్పింది.

ఇటీవల కేరళకు చెందిన ఆర్‌.బాబు ఇద్దరు మిత్రులతో కలిసి మలప్పుజ సమీపంలోని కొండ శిఖరం ఎక్కే ప్రయత్నం చేశాడు. మిగతా ఇద్దరు మధ్యలోనే వెనక్కి వెళ్లినా.. బాబు మాత్రం విజయవంతంగా శిఖరం వరకు చేరుకున్నాడు. అయితే ఉన్నట్టుండి కిందికి జారి, కొండ చీలిక వద్ద చిక్కుకుపోయాడు. సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు చర్యలు చేపట్టినప్పటికీ.. అతడి వరకూ చేరుకోలేకపోయాయి. దాంతో గత రెండు రోజులుగా అతడు తిండి, నీరు లేక ఒంటరిగా అక్కడే గడపాల్సి వచ్చింది. పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి పినరయి విజయన్ భారత సైన్యం సహాయం కోరారు. దాంతో ఆర్మీకి చెందిన సదరన్‌ కమాండ్ ఈ రోజు రంగంలోకి దిగి, అతడిని ప్రాణాపాయం నుంచి కాపాడింది.

ఈ ఆపరేషన్‌కు సంబంధించిన చిత్రాలను సదరన్‌ కమాండ్ ట్విటర్‌లో షేర్ చేసింది. సుశిక్షితులైన తమ బృంద సభ్యులు యువకుడిని రక్షించాయని ప్రశంసించింది. ఆపరేషన్ అనంతరం ఆర్మీ సిబ్బంది విజయ చిహ్నం చూపిస్తూ..చిరునవ్వులు చిందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని