vaccines shortage: వ్యాక్సిన్ల కొరత లేదు: కేంద్రం

దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత లేదని కేంద్రం స్పష్టంచేసింది. నిపుణుల కమిటీ సూచనల మేరకు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగానే వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్నామన....

Published : 23 Jul 2021 21:23 IST

దిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత లేదని కేంద్రం స్పష్టం చేసింది. నిపుణుల కమిటీ సూచనల మేరకు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగానే వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్నామని తెలిపింది. దేశంలో వ్యాక్సిన్ల కొరతపై ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

వ్యాక్సిన్ల ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వద్ద 15 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని మంత్రి తన సమాధానంలో పేర్కొన్నారు. ఇంకా 10 శాతం జనాభాకు కూడా వ్యాక్సిన్లు వేయని విషయం గురించి ప్రభుత్వానికి తెలుసా? అన్న ప్రశ్నకు.. జులై 20 నాటికి 18 ఏళ్లు పైబడిన వారిలో 34.5 శాతం మందికి కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్‌ అందించినట్లు తెలిపారు. 32.64 కోట్ల మందికి తొలి డోసు వేయగా.. 8.55 కోట్ల మందికి రెండు డోసులు పూర్తయినట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 2.15 వ్యాక్సిన్‌ కేంద్రాల్లో వ్యాక్సిన్‌ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. వ్యాక్సిన్ల తయారీ పెంపునకు భారత్‌ బయోటెక్‌, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌లకు కేంద్రం అడ్వాన్సు చెల్లింపులు చేసిందని మంత్రి తన సమాధానంలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని