Parliament: గంగానదిలో మృతదేహాలపై సమాచారం లేదు: కేంద్రం

కరోనా రెండో దశ సమయంలో గంగా నదిలో మృతదేహాలు కొట్టుకురావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా రాజ్యసభలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. గంగానదిలో ఎన్ని మృతదేహాలు కొట్టుకొచ్చాయి? వాటి అంతిమ సంస్కారాలకు ఎలాంటి

Published : 08 Feb 2022 01:28 IST

దిల్లీ: కరోనా రెండో దశ సమయంలో గంగా నదిలో మృతదేహాలు కొట్టుకురావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా రాజ్యసభలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. గంగానదిలో ఎన్ని మృతదేహాలు కొట్టుకొచ్చాయి? వాటి అంతిమ సంస్కారాలకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ డెరిక్‌ ఓ బ్రియన్‌ రాజ్యసభలో ప్రశ్నించారు. దీనికి స్పందించిన కేంద్రం.. తమ వద్ద మృతదేహాల వివరాలు ఏమీ లేవని సమాధానం ఇచ్చింది. 

‘‘ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ గుండా ప్రవహించే గంగానదిలో గుర్తుతెలియని అనేక మృతదేహాలు కొట్టుకురావడం.. నది ఒడ్డున బయటపడటం వాస్తవమే. మృతదేహాలు, అంతిమ సంస్కారాలకు సంబంధించి నివేదికలు సమర్పించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేశాం. కానీ, మృతదేహాల వివరాలు మా వద్ద లేవు’’అని కేంద్ర జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ టుడు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

కాగా.. కేంద్రమిచ్చిన సమాధానంపై విపక్షాలు అసహనం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం అబద్దాలు చెబుతోందని, నిజాలు దాచిపెడుతోందని ఆరోపించారు. ‘‘భాజపా ప్రభుత్వం పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టిస్తోంది. కరోనా నేపథ్యంలో ఆక్సిజన్‌ కొరతతో మృతి చెందిన వారి గురించి ప్రశ్నిస్తే.. ఇలాగే వివరాలు లేవంటూ సమాధానం ఇచ్చింది’’అని కాంగ్రెస్‌ నేత వేణుగోపాల్‌ మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు