Rahul Gandhi: మోదీజీ.. సిగ్గుచేటుగా అనిపించడం లేదా..! రాహుల్‌ ఫైర్‌

నేరస్థులకు భాజపా(BJP) మద్దతు పలకడం.. మహిళల పట్ల ఆ పార్టీ సంకుచిత మనస్తత్వాన్ని ప్రదర్శిస్తోందని రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) విమర్శించారు...

Published : 19 Aug 2022 01:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నేరస్థులకు భాజపా(BJP) మద్దతు పలకడం.. మహిళల పట్ల ఆ పార్టీ సంకుచిత స్వభావానికి నిదర్శనమని కాంగ్రెస్‌(Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) విమర్శించారు. ఇలాంటి రాజకీయాలు చేయడం సిగ్గుచేటుగా అనిపించడం లేదా? అని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని ప్రశ్నించారు. గుజరాత్‌(Gujarat)లో బిల్కిస్‌ బానో అనే మహిళపై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న 11 మంది నేరస్థులను ఇటీవల విడుదల చేసిన వ్యవహారంపై రాహుల్ ఈ మేరకు స్పందించారు. గతంలో జరిగిన పలు అత్యాచార ఘటనల్లో భాజపా అవలంబించిన వైఖరిని ఎండగడుతూ ట్వీట్‌ చేశారు. 

‘ఉన్నావ్‌ - భాజపా ఎమ్మెల్యేను రక్షించే ప్రయత్నం..
కథువా - అత్యాచార నిందితులకు మద్దతుగా ర్యాలీ..
హాథ్రాస్‌ - అత్యాచార నిందితుల పక్షాన ప్రభుత్వం నిలవడం..
గుజరాత్‌ - అత్యాచారానికి పాల్పడిన నేరస్థులు విడుదల, సన్మానం..
ఇలా ఆయా ఘటనల్లో నేరస్థులకు మద్దతు ఇవ్వడం.. మహిళల పట్ల భాజపా సంకుచిత మనస్తత్వాన్ని బయటపెడుతోంది. ఇలాంటి రాజకీయాలు సిగ్గుచేటుగా అనిపించడం లేదా?’ అని గురువారం ప్రధాని మోదీని ప్రశ్నిస్తూ ట్వీట్‌ చేశారు.

ఆసక్తికర సైడ్‌ స్టోరీ ఉంది..: చిదంబరం

ఈ వ్యవహారంపై స్పందించిన మరో కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం సైతం.. అత్యాచార దోషుల విడుదల వెనుక ఆసక్తికర కథనం ఉందంటూ వరుస ట్వీట్లు చేశారు. దోషుల విడుదల రివ్యూ ప్యానెల్‌లో ఇద్దరు భాజపా ఎమ్మెల్యేలు ఉన్నారని పేర్కొన్నారు. మరొక సభ్యుడు.. గోధ్రా రైలు దహనం కేసు విచారణలో కీలక సాక్షి అని పేర్కొన్నారు. ఇది పార్టీలకతీతమైన, తటస్థమైన, క్రిమినాలజీ, పెనాలజీ నిపుణులతో కూడిన ప్యానెల్ కాదా? అని చిదంబరం ప్రశ్నించారు.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని