Coal crisis: విద్యుత్‌ ఉత్పత్తికి బొగ్గు కొరత ఉండదు: ప్రహ్లాద్‌ జోషి

బొగ్గు కొరత కారణంగా దేశంలోని పలు పవర్‌ప్లాంట్లు కొట్టుమిట్టాడుతున్న వేళ కేంద్ర బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్‌ ఉత్పత్తికి......

Published : 13 Oct 2021 19:26 IST

బిలాస్‌పూర్‌:  బొగ్గు కొరత కారణంగా దేశంలోని పలు పవర్‌ప్లాంట్లు కొట్టుమిట్టాడుతున్న వేళ కేంద్ర బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు సరఫరాలో సంక్షోభం తలెత్తబోదన్నారు. బుధవారం ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో కోల్‌ ఇండియా అనుబంధ సంస్థ ఎస్‌ఈసీఎల్‌ పరిధిలోని గనుల్ని పరిశీలించేందుకు బిలాస్‌పూర్‌ విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్‌ఈసీఎల్‌ పరిధిలోని గెవ్రా, డిప్కా, కుష్మాండ గనులను పరిశీలించి బొగ్గు ఉత్పత్తి అంశంపై అధికారులతో సమీక్షించనున్నట్టు చెప్పారు. దేశంలో బొగ్గు కొరత తీవ్రంగా ఉందంటూ కాంగ్రెస్‌ ప్రచారం చేస్తోందా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ఈ విషయాన్ని తాను రాజకీయం చేయాలనుకోవడంలేదన్నారు. ఇప్పటికే తాము విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు సరఫరాను చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం విద్యుత్‌ ఉత్పత్తికి 1.1మిలియన్‌ టన్నుల బొగ్గు అవసరం కాగా.. రెండు మిలియన్ల టన్నుల బొగ్గును సరఫరా చేసినట్టు తెలిపారు. దీంతో నిల్వలు కూడా పెరిగిపోతున్నాయన్నారు. దేశంలో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును సరఫరా చేయడంలో సమస్య ఉండబోదని తాను హామీ ఇస్తున్నానన్నారు. ప్రస్తుతం ఎస్‌ఈసీఎల్‌ను సందర్శించేందుకు వెళ్తున్నట్టు చెప్పిన ఆయన.. అక్కడి గనులను సందర్శించి ఉత్పత్తిని మరింత వేగవంతం చేసేలా చర్చలు జరపనున్నట్టు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు