భారత కీర్తి పతాక రెపరెపలాడాలి: పీయూష్‌

చార్టెడ్‌ అకౌంటెంట్లు అందరూ ఉన్నతంగా ఆలోచించాలని, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని కేంద్ర కామర్స్‌, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ అన్నారు. 73వ చార్టెడ్‌ అకౌంటెంట్స్‌ దినోత్సవం సందర్భంగా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెడ్ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ)ఆధ్వర్యంలో...

Published : 01 Jul 2021 21:59 IST

దిల్లీ: చార్టెడ్‌ అకౌంటెంట్లు అందరూ ఉన్నతంగా ఆలోచించాలని, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని కేంద్ర కామర్స్‌, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. 73వ చార్టెడ్‌ అకౌంటెంట్స్‌ దినోత్సవం సందర్భంగా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెడ్ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సీఏలో రాణించాలంటే పూర్తి స్థాయిలో పని చేయాల్సిన అవసరముందన్నారు. సంస్థల భాగస్వామ్యాలు, విలీనాలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రపంచ స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.

75వ వసంత వేడుకలు జరుపుకొనే సమయానికి భారత్‌కు చెందిన చార్టెడ్‌ అకౌంటెట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లెయింట్స్‌కు సేవలు అందించే స్థాయికి ఎదగాలన్నారు. ఈ మేరకు ఐసీఏఐ అవసరమైన నాణ్యతా ప్రమాణాలను పాటించాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని గోయల్‌ అన్నారు. భారత కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పేందుకు ప్రతి ఒక్క సీఏ, సీఏ విద్యార్థి కృషి చేయాలన్నారు. ‘‘సమగ్రత, నిబద్ధత, జవాబుదారీతనం, మేధస్సు ఐసీఏఐలో ప్రతిబింబించాలి. ప్రపంచంలోని అగ్ర అకౌంటింగ్‌ సంస్థల్లో మనముండాలి. ఉన్నత ప్రమాణాలు, సాంకేతికతకు ఐఏసీఐ ఆలవాలంగా ఉండాలి’’ అని గోయల్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని