Republic Day: ఆ నగరంలో డ్రోన్లు, గాలిపటాలపై నిషేధం..!
గణతంత్ర దినోత్సవ(Republic Day) వేడుక నేపథ్యంలో గురుగ్రామ్ యంత్రాంగం డ్రోన్లు, గాలిపటాలపై నిషేధాజ్ఞలు విధించింది. అలాగే పలు ఆదేశాలు ఇచ్చింది.
గురుగ్రామ్: గణతంత్ర దినోత్సవం(Republic Day) సమీపిస్తోన్న తరుణంలో హరియాణాలోని గురుగ్రామ్(Gurugram) నగర యంత్రాంగం కీలక ఆదేశాలు ఇచ్చింది. డ్రోన్లు, మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్, గ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లు, గాలిపటాలు, చైనా తయారీ మైక్రోలైట్లపై నిషేధం విధించింది. జనవరి 26 వరకు ఇది అమల్లో ఉండనుంది. 144 సెక్షన్ కింద డిప్యూటీ కమిషనర్ నిశాంత్ కుమార్ యాదవ్ ఈ ఆదేశాలు జారీ చేశారు.
అలాగే సైబర్ కేఫ్, గెస్ట్ హౌస్‌లు, హోటళ్ల యజమానులకు పలు సూచనలు చేశారు. సందర్శకులు, అతిథుల ఐడీ కార్డులను భద్రపరచాలని, రికార్డులను నిర్వహించాలని ఆదేశించారు. ‘గణతంత్ర దినోత్సవ వేడుక నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ముందుజాగ్రత్తలో భాగంగా ఈ ఆదేశాలు ఇచ్చాం. వీటిని ధిక్కరించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయి’ అని హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
భారత్‌కు తిరిగి రానున్న శివాజీ ‘పులి గోళ్లు’!
-
‘సీఎం ఇంటికి కూతవేటు దూరంలోనే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం’
-
కన్నవారి నడుమ కుదరని ఏకాభిప్రాయం.. మూడేళ్ల చిన్నారికి పేరు పెట్టిన హైకోర్టు
-
Chandrababu: జైలులో నేడు చంద్రబాబు దీక్ష
-
తిరుమలలో బ్రేక్ దర్శనం, గదుల బుకింగ్‌కు ‘పే లింక్’ సందేశాలతో నగదు చెల్లింపు!
-
విశాఖలో పిడుగు పాటు.. వీడియో వైరల్