Tokyo Olympics: మహిళల హాకీ బృందానికి వజ్రాల వ్యాపారి భారీ కానుక

టోక్యో ఒలింపిక్స్‌ మహిళల హాకీ సెమీఫైనల్స్‌లో ఆర్జెంటీనాతో జరిగిన ఉత్కంఠభరితమైన

Published : 06 Aug 2021 01:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టోక్యో ఒలింపిక్స్‌ మహిళల హాకీ సెమీఫైనల్స్‌లో ఆర్జెంటీనాతో జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో భారత మహిళల జట్టు ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే.  అయినప్పటికీ రాణి రాంపాల్‌ సేన పోరాడి ఓడిన తీరుకు దేశం మెత్తంగా అండగా నిలిచింది. మహిళా బృందం అద్భుత ప్రదర్శనకు యావత్‌ దేశం జైకొట్టింది. ఈ క్రమంలో గుజరాత్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త ఒలింపిక్స్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన భారత్‌ మహిళా హాకీ జట్టులోని సభ్యులకు ఇల్లు, కారును అందిస్తామని హామీ ఇచ్చారు. 

గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి సావ్జీ ధోలాకియా భారత హకీ జట్టులోని అమ్మాయిలు సొంత ఇంటిని నిర్మించుకునేందుకు ఒక్కొక్కరికి 11 లక్షల చొప్పున ఇస్తానని ప్రకటించారు. ఇప్పటికే ఇల్లు ఉన్న వారి 5 లక్షల విలువచేసే కారు అందజేస్తామని తెలిపారు. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి భారత హాకీ జట్టు క్రీడాకారిణులకు ఒక్కొక్కరికి అదనంగా లక్ష రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చినట్టు పేర్కొన్నారు.   

భారత హాకీ చరిత్రలో తొలిసారిగా అమ్మాయిల బృందం ఒలింపిక్స్‌లో సెమీస్‌కు వెళ్లింది. ఎన్నో అంచనాలతో సెమీ ఫైనల్లో బరిలోకి దిగిన రాణి రాంపాల్‌ సేన బుధవారం జరిగిన హోరా హోరీ పోరులో ప్రపంచ నంబర్‌వన్‌ అర్జెంటీనాతో పోరాడి ఓడింది. స్వర్ణ పతక పోరాటం నుంచి నిష్క్రమించిన భారత మహిళల హాకీ బృందం శుక్రవారం జరగబోయే కాంస్య పతక పోరులో బ్రిటన్‌తో తలపడనుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు