Anand Mahindra: నూతన సంవత్సర తీర్మానాలపై మహీంద్రా పంచ్‌

కొత్త సంవత్సరం తీర్మానాల గురించి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కామెంట్‌ చేశారు. ఆయన షేర్ చేసిన చిత్రంపై నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. 

Updated : 04 Jan 2023 13:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్: కొత్త సంవత్సరంలో లైఫ్‌ను మరింత అందంగా మార్చుకోవాలని తీర్మానించుకునే వారెందరో. పుస్తకాలు చదవాలని, వేకువజామునే నిద్ర లేవాలని, క్రమంగా తప్పకుండా వ్యాయామం చేయాలని, కొత్త విషయాలు నేర్చుకోవాలని.. ఇలా బోలెడు తీర్మానాలు చేసుకుంటారు. పాటించాలని బలంగా అనుకుంటారు. జనవరి మొదటి రోజు అనుకున్నట్టే పాటిస్తారు. ఇక తర్వాత నుంచి తేదీలు మారుతూ ఉంటాయి. దాంతో పాటే తమ తీర్మానాలకు సడలింపులు తోడవుతుంటాయి. ఇక కొద్దినెలలు గడిచేసరికి అసలు ఏం అనుకున్నామో కూడా గుర్తుండని పరిస్థితి..! ఈ ఆరంభ శూరత్వం గురించి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా ఓ చిత్రాన్ని షేర్ చేశారు. ‘కొత్త సంవత్సరం మొదటివారం మధ్యలో ఇలాగే ఉంటుంది’ అని తనదైన శైలిలో పంచ్‌ విసిరారు. ఇది నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని