Lockdown: గడియారాల ఘనుడు

కొందరు తమకు ఇష్టమైన వస్తువులను సేకరించి ఒక చోట భద్రపరచుకుని సంతృప్తి చెందుతారు. వాళ్లలో గడియారాలను సేకరించే అలవాటు ఉన్నవాళ్లను హోరాలజిస్టులు అంటారు. ఆ కోవకి చెందిన వారే కర్ణాటకకు చెందిన పొన్నాచి మహదేవ స్వామి

Updated : 23 May 2021 06:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొందరు తమకు ఇష్టమైన వస్తువులను సేకరించి ఒక చోట భద్రపరచుకుని సంతృప్తి చెందుతారు. వాళ్లలో గడియారాలను సేకరించే అలవాటు ఉన్నవాళ్లను హోరాలజిస్టులు అంటారు. ఆ కోవకి చెందిన వారే కర్ణాటకకు చెందిన పొన్నాచి మహదేవ స్వామి. వృత్తి పరంగా ఉపాధ్యాయుడైన మహదేవ స్వామికి చేతి గడియారాలు సేకరించడం హాబీ. స్వామికి యుక్తవయవసు నుంచే హెచ్‌ఎంటీ బ్రాండ్‌ వాచ్‌లంటే మక్కువ. ఆ బ్రాండ్‌ మీద ఉన్న ఇష్టంతో ఏకంగా ఉన్న ఏకంగా 400 హెచ్‌ఎంటీ వాచ్‌లను సేకరించారు. గడియారాలు సేకరణలో ప్రఖ్యాతిగాంచిన మహదేవ స్వామిని గతేడాది కేంద్ర సాహిత్య అకాడెమీ యూత్‌ అవార్డు కూడా వరించింది. వాచ్‌లను సేకరించడానికి స్వామి పలు గడియారం దుకాణాలు, ఆన్‌లైన్‌ షాపింగ్‌, షోరూంలను సంప్రదించారు. హెచ్‌ఎంటీ బ్రాండ్‌ వాచ్‌లే కాకుండా ఇతర బ్రాండ్‌ల వాచ్‌లనూ సేకరించారు. అందులో పురుషులకు సంబంధించి జనతా, కోహినూర్‌, కాంచన్‌, చాణక్య, మహిళలకు సంబంధించి కావేరి, గోదావరి, గంగ, తార వంటి వాచ్‌లు కూడా ఉన్నాయి. సేకరించిన వాటిలో చాలా వాచ్‌లు పనిచేయనివే. దాంతో ఈ లాక్‌డౌన్‌లో ఖాళీగా ఉన్న స్వామి యూట్యూబ్‌ సాయంతో వాచ్‌ రిపేరింగ్ నేర్చుకుని పాడైన వాటిని బాగుచేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని