Mamata Banerjee: దేశభక్తి గీతం రాసిన దీదీ!

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ దేశ ఐక్యతను..

Updated : 15 Aug 2021 16:12 IST

కోల్‌కతా: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ దేశ ఐక్యతను చాటి చెబుతూ దేశభక్తి గీతాన్ని రాశారు. ‘దేశ్‌ త సోబర్ నిజర్’ (ఈ దేశం మనందరిది) అంటూ సాగే ఈ పాటను బెంగాలీకి చెందిన ఇంద్రనీల్ సేన్, మోనోమోయ్ భట్టాచార్య, త్రిష పరుయ్, దేవజ్యోతి ఘోష్ ఆలపించారు. దీన్ని ఒక వీడియో రూపంలో అద్భుతంగా చిత్రీకరించారు. దీదీ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో శనివారం రాత్రి ఈ వీడియోను పోస్టు చేశారు. తాజాగా సోషల్‌ మీడియాలో ఇది తెగ చక్కర్లు కొడుతోంది.

‘మన స్వేచ్ఛను అణచివేయాలని చూస్తున్న దుష్ట శక్తులను తరిమికొడదాం. అందరం ఐకమత్యంతో కలిసి పోరాడదాం. మనకు స్వాతంత్య్రం తీసుకురావడానికి ఎందరో మహనీయులు వారి ప్రాణాలను త్యాగం చేశారు. వారిని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు’ అని 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దీదీ ట్వీట్‌ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కోల్‌కతాలో ప్రసిద్ధి చెందిన విక్టోరియా మెమోరియల్‌పై 7,500 చదరపు అడుగుల భారీ త్రివర్ణ పతాకాన్ని ఏర్పాటుచేశారు. ఆ రాష్ట్ర గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్‌ జెండాను ఆవిష్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని