thief: ఈ దొంగ చాలా రిచ్‌..కోటికి పైగా ఆస్తులు

ఇటీవల ఓ చోరీ కేసులో చిక్కిన దొంగకు కోటి రూపాయల ఆస్తులు ఉన్నాయని తెలియడంతో గుజరాత్‌ పోలీసులు ఆశ్చర్యపోయారు. 

Published : 06 Jul 2024 21:15 IST

గాంధీనగర్‌: గుజరాత్ పోలీసులు ఇటీవల ఓ చోరీ కేసులో రోహిత్ కానుభాయ్ సోలంకి అనే దొంగను అరెస్టు చేశారు. విచారణలో భాగంగా పోలీసులు అతడిని వివిధ రాష్ట్రాల్లో జరిగిన 19 దొంగతనాల్లో నిందితుడుగా గుర్తించారు. అంతే కాకుండా నిందితుడి గురించి ఆశ్చర్యకరమైన విషయాలు పోలీసుల దృష్టికి వచ్చాయి. దీంతో కంగుతినడం వారి వంతైంది. ముంబయిలో నిందితుడికి కోటి రూపాయలకు పైగా విలువ చేసే ఫ్లాట్‌, లగ్జరీ కారు ఉన్నట్లుగా విచారణలో భాగంగా గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు. 

అతడు విమానాల్లో వివిధ రాష్ట్రాలకు వెళ్లి అక్కడ ఉన్న విలాసవంతమైన హోటళ్లలో బస చేస్తాడని తెలిపారు. పగటి పూట వివిధ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి రాత్రుళ్లు దొంగతనాలకు పాల్పడుతుంటాడన్నారు. దొంగతనం చేసిన అనంతరం డ్యాన్స్‌ బార్‌లు, నైట్‌క్లబ్‌లలో పార్టీల్లో పాల్గొంటాడని, డ్రగ్స్‌ తీసుకుంటాడని పేర్కొన్నారు.

సూరత్‌, పోర్‌బందర్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అతడిపై కేసులు ఉన్నట్టు తెలిపారు. ఓ ఇంట్లో లక్ష రూపాయల చోరీ కేసులో పోలీసులకు చిక్కాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని