Mobile Phones: ఆ ఊరిలో పిల్లలు ఫోన్లు వాడరాదు

మహారాష్ట్ర యవత్‌మాల్‌ జిల్లాలోని బన్సి గ్రామ పంచాయతీ అరుదైన నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్ల లోపు వారు మొబైల్‌ ఫోన్‌ వాడకుండా నిషేధం విధించింది. ఈ నెల 11న ఈ మేరకు తీర్మానం చేసినట్లు గ్రామ సర్పంచి గజానన్‌ గురువారం వెల్లడించారు.

Published : 18 Nov 2022 08:52 IST

మహారాష్ట్రలో ఓ గ్రామ పంచాయతీ తీర్మానం

యవత్‌మాల్‌: మహారాష్ట్ర యవత్‌మాల్‌ జిల్లాలోని బన్సి గ్రామ పంచాయతీ అరుదైన నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్ల లోపు వారు మొబైల్‌ ఫోన్‌ వాడకుండా నిషేధం విధించింది. ఈ నెల 11న ఈ మేరకు తీర్మానం చేసినట్లు గ్రామ సర్పంచి గజానన్‌ గురువారం వెల్లడించారు. లాక్‌డౌన్‌ సమయంలో పిల్లల్లో మొబైల్‌ ఫోన్ల వినియోగం పెరిగిందని, ఆ తర్వాత అది వ్యసనంగా మారిందని ఆయన పేర్కొన్నారు. పిల్లలు మళ్లీ చదువుపై శ్రద్ధ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీన్ని ఉల్లంఘించినవారికి జరిమానా విధించనున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని